HomeTelugu Big Stories'రామారావు ఆన్ డ్యూటీ': రవితేజ బర్త్‌డే స్పెషల్‌ పోస్టర్‌

‘రామారావు ఆన్ డ్యూటీ’: రవితేజ బర్త్‌డే స్పెషల్‌ పోస్టర్‌

Ravi Teja Birthday Special
మాస్ మహారాజ రవితేజ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. నూతన దర్శకుడు శరత్ మండవ డైరెక్షన్‌లో ‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ తోనే అందరి దృష్టిని ఆకర్షించారు మేకర్స్. ఈరోజు రవితేజ పుట్టినరోజు సందర్భంగా ‘రామారావు ఆన్ డ్యూటీ’ నుంచి సరికొత్త పోస్టర్ ను విడుదల చేశారు మేకర్స్. ఈ బర్త్ డే పోస్టర్ లో రవితేజ ఫుల్ యాక్షన్ మోడ్ లో కనిపిస్తున్నాడు.

ఈ పోస్టర్ చూస్తుంటే సినిమాలో ట్రైన్ సన్నివేశం కీలకమని తెలుస్తోంది. అలాగే మూవీలో రొమాంటిక్ ట్రాక్ తో పాటు ఫ్యామిలీ ఎంటర్టైనింగ్ అంశాలు ఉన్నట్టు పోస్టర్ లోనే స్పష్టమవుతోంది. ఈ చిత్రంలో ఆయన దూకుడు స్వభావం కలిగిన నిజాయితీ గల ప్రభుత్వ అధికారిగా కన్పించబోతున్నట్టు ఫస్ట్ లుక్ పోస్టర్ లోనే స్పష్టం చేశారు మేకర్స్.

కాగా దివ్యాంశ కౌశిక్, రజిషా విజయన్ హీరోయిన్‌లుగా నటిస్తున్న ఈ యాక్షన్ మూవీలో వేణు తొట్టెంపూడి కీలక పాత్రలో కనిపించనున్నారు. ఎస్ఎల్వీ సినిమాస్ ఎల్ఎల్పి, ఆర్టి టీమ్‌వర్క్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సామ్ సిఎస్ సంగీతం అందించారు. ఈ సినిమా 2022 మార్చి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu