HomeTelugu Big Stories'ఖిలాడి' ట్రైలర్‌

‘ఖిలాడి’ ట్రైలర్‌

Khiladi Movie Trailer

మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తున్న చిత్రం ‘ఖిలాడి’. రమేష్ వర్మ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమాని జయంతీలాల్ గడ (పెన్ స్టూడియోస్) సమర్పణలో హవీష్ ప్రొడక్షన్స్ ఎ స్టూడియోస్ బ్యానర్స్ పై నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో డింపుల్ హయతి, మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటించారు. ఫిబ్రవరి 11 న ఈ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన మేకర్స్ తాజాగా ప్రమోషన్స్ లో భాగంగా ట్రైలర్ ని విడుదల చేశారు.

ఈ ట్రైలర్ లో రవితేజ డబుల్ రోల్ చేస్తున్నట్లు చూపించారు. ఒకరు మనీ మైండేడ్ గా ఉంటె మరొకరు ఫన్నీ గా కనిపించాడు. ఇద్దరు హీరోయిన్లతో రవితేజ రొమాన్స్, యాక్షన్ ఛేజ్ లు, ఒక పాపను ప్రధానంగా చూపించి ట్విస్ట్ క్రియేట్ చేశారు. డింపుల్ , మీనాక్షి అందాలు, లిప్ లాక్ లు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఉన్ని ముకుందన్ ,అనసూయ, వెన్నెల కిషోర్ , రావు రమేష్ లా కామెడీ హైలైట్ గా నిలవనుందని తెలుస్తోంది. ఇక ముఖయంగా దేవి శ్రీ ప్రసాద సంగీతం ఆకట్టుకొంటుంది. ఈ చిత్రాన్ని హై టెక్నికల్ వాల్యూస్ తో రూపొందించినట్లు ఈ యాక్షన్ పాకెడ్ ట్రైలర్ చూస్తే తెలుస్తుంది. మరి ఈ సినిమాతో మాస్ మహారాజా మరో హిట్ ని అందుకుంటాడేమో చూడాలి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu