HomeTelugu Trending'రాజా ది గ్రేట్ ' సీక్వెల్స్‌!

‘రాజా ది గ్రేట్ ‘ సీక్వెల్స్‌!

Raviteja ready for Raja the

మాస్‌ మహా రాజా రవితేజ వరుస సినిమాలతో బీజీగా ఉన్నాడు. ఈ ఏడాది ఆరంభంలో ‘క్రాక్’ సినిమాతో భారీ విజయాం అందుకున్నాడు. ప్రస్తుతం ‘ఖిలాడి’ మూవీ షూటింగ్‌ జరుగుతుంది. ఈ సినిమా తరువాత ఆయన త్రినాథరావు నక్కిన .. శరత్ మండవ దర్శకత్వంలోని సినిమాలను లైన్లో పెట్టేశాడు. ఆ తరువాత ప్రాజెక్టుగా ఆయన ఒక సీక్వెల్ చేయనున్నట్టుగా తెలుస్తోంది. ఆ సీక్వెల్ సినిమానే ‘రాజా ది గ్రేట్’.

అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా, బ్లాక్ బస్టర్ హిట్ అనిపించుకుంది. ఈ సినిమాలో రవితేజ అంధుడి పాత్రలో నటించాడు. ఆయన సినిమాలో ఉండవలసిన అంశాలు ఎంతమాత్రం తగ్గకుండా చూసుకోవడంలో అనిల్ రావిపూడి సక్సెస్ అయ్యాడు. ఆల్రెడీ ‘ఎఫ్ 2’ సినిమాకి సీక్వెల్ చేస్తున్న అనిల్ రావిపూడి, రీసెంట్ గా రవితేజను కలిసి, ‘రాజా ది గ్రేట్ ‘ సినిమా సీక్వెల్ కి కథ చెప్పాడట. కథ సూపర్ గా ఉండటంతో వెంటనే ఆయన ఓకే చెప్పేశాడని అంటున్నారు. ఇక ఈ సినిమా ఎప్పుడు సెట్స్‌ పైకి వెళుతుందో చూడాలి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu