రవితేజ కొత్త సినిమా ఈ నెలలోనే ప్రారంభం!

సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో రవితేజ ఒక సినిమాకు సంతకం చేసిన సంగతి తెలిసిందే. సినిమా కూడా అధికారికంగా అయింది. కానీ ఇప్పటి వరకు రెగ్యులర్ షూట్ మొదలుకాలేదు. తాజా సమాచారం మేరకు ఇన్నిరోజులు ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని, ఈ నెల 15 నుండి రెగ్యులర్ షూట్ మొదలవుతుందని తెలుస్తోంది. మొదటి షెడ్యూల్ హైదరాబాద్లోనే ఉంటుందట. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇకపోతే రవితేజ ప్రజెంట్ విని ఆనంద్ డైరెక్షన్లో ‘డిస్కో రాజ’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.