కౌశల్‌ ఆర్మీ గురించి శ్రీరెడ్డి ఏమందో తెలుసా?

టాలీవుడ్‌లో దాదాపు ప్రముఖులందరిపైనా కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేసి సంచలనం సృష్టించిన శ్రీరెడ్డి విషయం అందరికీ తెలిసిందే. సినిమాల్లో కంటే ఈ సంచలనాలతోనే అందరిలో చర్చనీయాంశమైన శ్రీరెడ్డి అప్పట్లో బిగ్‌బాస్ హోస్ట్ నానిపైనా విమర్శలు చేసింది. తాజాగా బిగ్‌బాస్ షోతో పాటు కౌశల్‌ ఆర్మీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలుచేసింది. ప్రస్తుతం కోలీవుడ్‌లో మకాం పెట్టిన ఈ అమ్మడు టాలీవుడ్‌ను వదలకుండా ఏమాత్రం అవకాశమొచ్చినా విమర్శలు చేస్తూనే ఉంటుంది. బిగ్‌బాస్ షోలోని ఓ వ్యక్తిపై పేరు మార్చి ఆరోపణలు చేసింది. నూని ఓవరాక్షన్ చాలా ఎక్కువ చేస్తున్నాడు అంటూ వ్యాఖ్యలు చేసింది. ఇవి శ్రీరెడ్డి ఎవరిని దృష్టిలో పెట్టుకుని ఆరోపణలు చేసిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

కౌశల్ ఆర్మీకి శ్రీరెడ్డి పలు సూచనలు చేసింది. నూని పని పట్టండి. అయితే బిగ్‌బాస్ ఇంట్లోని సభ్యులపై ఎలాంటి కామెంట్స్ చేయొద్దు. ముఖ్యంగా ఆడవారిని ఏమీ అనొద్దు.. సభ్యులను ట్రోల్ చేసి చెడ్డపేరు తెచ్చుకోవద్దని సూచించింది. బిగ్ బాస్ 2 విజేత కౌశల్ మాత్రమేనని శ్రీరెడ్డి తేల్చి చెప్పింది. అందరూ కౌశల్‌కు ఓటు వేయండి అని సూచించింది. బిగ్ బాస్ హౌస్‌లో అందరికంటే బలమైన కంటెస్టెంట్, ఎక్కువ మంది ప్రేక్షకుల సపోర్ట్ ఉన్న వ్యక్తి కౌశల్ మాత్రమేనని శ్రీరెడ్డి తెలిపింది. బిగ్ బాస్ షో ప్రారంభంలో కౌశల్‌పై విమర్శలు చేసిన శ్రీరెడ్డి ఇపుడు అదే కౌశల్‌కు మద్దతు తెలుపుతూ వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమైంది.