HomeTelugu Newsతన అందాలతో మెగా కాంపౌండ్‌ నుంచి ఛాన్స్‌ కొట్టేసిన నటి..!

తన అందాలతో మెగా కాంపౌండ్‌ నుంచి ఛాన్స్‌ కొట్టేసిన నటి..!

4 7మెగా కాంపాండ్‌లో ఎంట్రీకోసం ఓ భామ బికినీ అస్త్రాన్ని ప్రయోగించింది. ఈ కాలంలో హీరోయిన్స్‌ అవకాశాల కోసం దర్శక, నిర్మాతలను వేడుకోవడం లేదు. అలాగని వారిని అన్ని రకాలుగా ఆకట్టుకునే ప్రయత్నాలూ మానడం లేదు. సోషల్ మీడియా పుణ్యమా అని తమ ప్రొఫైల్‌ను తామే ఎలివేట్ చేసుకునే కార్యక్రమాన్ని తమ అందాలను నెట్టింట్లో ఆరబోస్తూ దిగ్విజయంగా పూర్తి చేస్తున్నారు. ఇప్పటి వరకూ చాలామంది భామలు ఈ ప్రాసెస్‌లోనే సోషల్‌ మీడియాను తమ అందాలకు అడ్డాగా మార్చుకున్నారు. ఇప్పుడు టాలీవుడ్ తూనీగ రియా చక్రవర్తి కూడా ఈ లిస్ట్‌లోకి చేరింది.

తూనీగ తూనీగ చిత్రంతో టాలీవుడ్‌లో కథానాయికగా ఎంట్రీ ఇచ్చిన ఈ భామ. ఆ సినిమా రిజల్ట్‌ తేడా వచ్చినా రియాకు బాలీవుడ్‌ నుంచి మంచి అవకాశాలొచ్చాయి. అయితే అమ్మడికి ఆ సినిమాలు కూడా సరైన గుర్తింపు ఇవ్వలేకపోయాయి. దీంతో రియా తన ఫోకస్ సోషల్ మీడియాపైన పెట్టింది. అక్కడ అన్‌ లిమిటెడ్ అందాలను ప్రదర్శిస్తూ దర్శక నిర్మాతలను ఆకట్టుకునే ప్రయత్నాలు సాగిస్తోంది. అందులో భాగంగానే ఇప్పుడు అమ్మడి బీచ్‌ బికినీ ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

రియా చక్రవర్తి అందాల ప్రదర్శన వల్ల ఎన్నో అవకాశాలు వస్తున్నా తాను మాత్రం స్టార్ హీరోల సరసనే నటిస్తానంటోంది. ఆరేళ్లుగా హీరోయిన్‌గా నటిస్తున్నా ఇప్పటి వరకు ఒక్క స్టార్ హీరో సరసనా నటించలేకపోయిన కారణంగానే అమ్మడు ఈ నిర్ణయం తీసుకుందని చెప్పుకోవాలి. మొత్తంమీద రియా చక్రవర్తి ప్రయత్నం ఫలించినట్టే కనిపిస్తోంది. ఈ అమ్మడుకి మెగా కాంపౌండ్‌ నుంచి పిలుపొచ్చిందట. చిరంజీవి అల్లుడు కల్యాణ్‌దేవ్ హీరోగా నటిస్తున్న రెండో సినిమాలో రియా చక్రవర్తికి హీరోయిన్‌గా అవకాశం వచ్చిందని తెలుస్తోంది. త్వరలో సెట్స్‌పైకి వెళ్లనున్న ఈ సినిమాలో రియా ఓ రేంజ్‌లో గ్లామర్ ఒలకబోయనుందట.

Recent Articles English

Gallery

Recent Articles Telugu