HomeTelugu Big Storiesఆచార్యలో కనిపించని కాజల్..కారణం అదేనా...?

ఆచార్యలో కనిపించని కాజల్..కారణం అదేనా…?

Reason Behind Why Kajal Aggarwal Doesnt Act In Acharya Movie

టాలీవుడ్ చందమామ కాజల్ తెలుగులో తనకంటూ మంచి మార్క్ ను సొంతం చేసుకున్న కాజల్, పెళ్లి చేసుకుని రీసెంట్ గా తల్లి కూడా అయ్యింది. అయితే అంతకు ముందు వరకూ కాజల్ నటిస్తూనే ఉంది. మెగాస్టార్ చిరంజీవి ఆచార్యలో కూడా ఆమె హీరోయిన్ గా షూటింగ్ లో పాల్గొనడం అంత బాగుంది కానీ, అయితే సినిమాలో మాత్రం లేకుండా పోయింది. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి సరసన హీరోయిన్ గా ఆమె నటించింది. కొంత భాగం షూటింగ్ కూడా పూర్తి అయ్యింది. ఫస్ట్ షెడ్యూల్ పూర్తయిన తర్వాత కాజల్ పాత్ర అంతగా అనిపించక పోవడంతో ఆమె పాత్రను తొలగించినట్టు డైరెక్టర్ కొరటాల శివ వివరణ ఇచ్చారు. ఇదే విషయాన్ని కాజల్ కు కూడా వివరించగా ఆమె కామ్ గా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుందట.

ఈ విషయంలో కాజల్ కు ఏమాత్రం అసంతృప్తి లేదని తెలుస్తోంది. మూమూలుగా అయితే సినిమా నుంచి మధ్యలో తప్పిస్తే హీరోయిన్లు ఎవరూ ఊరుకోరు కాని కాజల్ మాత్రం కామ్ గా ఉండటానికి ఓ కారణం ఉంది అని ఇండస్ట్రీ టాక్ .. అదేంటి అంతే తన రెమ్యునరేషన్ కోటిన్నర రూపాయలను ఆమె తీసుకుందని. తనకు రావాల్సిన డబ్బు వచ్చినందున … సినిమా నుంచి పక్కన పెట్టినా ఆమె సైలెంట్ గా ఉందని అంటున్నారు. అంతే కాదు తనకు పెళ్ళి కావడం, వెంటనే ప్రెగ్నన్సీ ప్లానింగ్ లో ఉండటంతో సినిమాలను లైట్ తీసుకుంటుంది కాజల్. ఆచార్య సినిమాతో పాటు కమల్ హాసన్ తో భారతీయుడు2 కూడా వదిలేసుకుంది కాజల్. వీటితో పాటు మరికొన్ని మూవీస్ నుంచి కూడా తప్పుకుని, ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu