ఆచార్య ‘సిద్ధ’ వచ్చేశాడు

మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ‘ఆచార్య’. కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ పతాకంపై ఆయన తనయుడు రామ్‌చరణ్‌‌ నిర్మిస్తూ ఈ సినిమాలో (సిద్ధ)అనే ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇటీవల తండ్రీ తనయుల కాంబినేషన్‌లో కీలకమైన సన్నివేశాలను సింగరేణి ప్రాంతంలో చిత్రీకరించారు. ఈ రోజు చరణ్‌ పుట్టినరోజు సందర్భంగా చిత్రంలోని ఆయన లుక్‌ను పోస్టర్‌ రూపంలో విడుదల చేశారు. వారిద్దరు చేతిలో తుపాకులతో వస్తున్న ఈ పోస్టర్‌ ఫ్యాన్స్‌ని ఆకట్టుకుంటోంది. ఇటీవల చిరు చెప్పినట్టు వారి వేషధారణలు మావోయిస్టు తరహాలో ఉన్నాయి.

కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా టీజర్‌ ఇటీవల విడుదలై ప్రేక్షకుల మన్ననలు పొందిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కాజల్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. పూజాహెగ్డే చరణ్‌కు జోడిగా నటిస్తోంది. మే 13న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

CLICK HERE!! For the aha Latest Updates