నానితో రెజీనా..?

నటుడిగా ప్రయాణం మొదలుపెట్టిన అవసరాల శ్రీనివాస్ ‘ఊహలు గుసగుసలాడే’ చిత్రంతో
దర్శకుడిగా మారాడు. రీసెంట్ గా ‘జ్యో అచ్యుతానంద’ అనే చిత్రాన్ని రూపొందించి మరోసారి
తన సత్తాను చాటుకున్నాడు. అవసరాల త్వరలోనే నాని హీరోగా ఓ సినిమా చేయనున్నాడని
స్వయంగా తనే చెప్పుకొచ్చాడు. ఈ విషయాన్ని నాని కూడా అంగీకరించాడు. నాని నిర్మాతగా
మరి చేయబోయే మొదటి సినిమా ఇదే అని టాక్. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా
రెజీనాను ఎంపిక చేసుకున్నారని తెలుస్తోంది. గతంలో అవసరాల డైరెక్షన్ లో రెజీనా ‘జ్యో
అచ్యుతానంద’ సినిమాలో నటించింది. ఆ సినిమాలో అమ్మడు నటనకు మంచి మార్కులే
పడ్డాయి. సినిమాకు కూడా సూపర్ హిట్ టాక్ వచ్చింది. అదే సెంటిమెంట్ తో మరోసారి
రెజీనాను హీరోయిన్ గా సెలెక్ట్ చేసుకున్నారని ఫిల్మ్ నగర్ గానం. మరి నాని, రెజీనాల
జంటకు ఎన్ని మార్కులు పడతాయో.. చూడాలి!

CLICK HERE!! For the aha Latest Updates