ప్రభాస్ తెలుగు మాస్టర్ అవతారం!

టైటిల్ ను చూసి సినిమాలో ఆయన పాత్ర అనుకుంటే పొరపాటే.. నిజంగానే ప్రభాస్ తెలుగు మాస్టర్ అవతారం ఎత్తాడు. అది కూడా కథానాయిక కోసం. ప్రభాస్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో ‘సాహో’ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో శ్రద్ధా కపూర్ ను హీరోయిన్ గా ఎంపిక చేశారు. శ్రద్ధాకు ఇది తొలి తెలుగు సినిమా కావడంతో ప్రభాస్ దగ్గరుండి తెలుగు డైలాగులకు హిందీలో అర్ధం చెబుతున్నాడట. అలానే ప్రభాస్ కు హిందీ కొంచెం కొంచెం వచ్చు.
అయితే బాలీవుడ్ లో ఆయన మొదటి సినిమా కావడంతో ఆ విషయంలో శ్రద్ధా ఆయనకు సహాయం చేస్తానని హామీ ఇచ్చిందట. ఈ సినిమాను డబ్బింగ్ సినిమా మాదిరి కాకుండా ఓ స్ట్రెయిట్ హిందీ సినిమాలానే విడుదల చేయాలన్నది నిర్మాతల ప్లాన్. అయితే తెలుగు వెర్షన్ తో పాటు ఒకేసారి హిందీ వెర్షన్ కూడా చిత్రీకరిస్తున్నారని తెలుస్తోంది. మొత్తానికి శ్రద్ధాకు ప్రభాస్.. ప్రభాస్ కు శ్రద్ధా కాపూరి ఒకరికొకరు గురువులైపోయారు.