రీమేక్ సినిమాలో చుట్టాలబ్బాయి!

రీమేక్ సినిమాలో చుట్టాలబ్బాయి!
హీరో ఆదికి ఈ మధ్యకాలంలో సరైన హిట్ సినిమా పడలేదు. ఎన్నో ఆశలతో చేసిన ‘చుట్టాలబ్బాయి’ సినిమాకు కూడా నెగెటివ్ టాక్ రావడంతో ఈసారి ఎలా అయినా హిట్ కొట్టాలనే ఉద్దేశ్యంతో రీమేక్ సినిమాపై పడ్డాడు. తమిళంలో వచ్చిన ‘ఎట్టి’ అనే చిత్రానికి అనూహ్యమైన స్పందన లభించింది. ఈ సినిమా చూసిన తరువాత తనకు ఈ సినిమా సెట్ అవుతుందని భావించిన ఆదికి ఈ రీమేక్ అవకాశం వెతుక్కుంటూ వచ్చిందట. ఓ అథ్లెట్ జీవిత చరిత్రగా తెరకెక్కనున్న ఈ సినిమాకు తనున్యాయం చేయగలననే ధీమను వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఈ సినిమా రీమేక్ పై నాగచైతన్య ఆసక్తి చూపినట్లుగా వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు ఆదినే ఈ సినిమాలో నటించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
CLICK HERE!! For the aha Latest Updates