Homeతెలుగు Newsలక్ష ఉద్యోగాలు కావాలంటే కేసీఆర్‌ ఉద్యోగం ఊడగొట్టాలి

లక్ష ఉద్యోగాలు కావాలంటే కేసీఆర్‌ ఉద్యోగం ఊడగొట్టాలి

సోమవారం ఆయన రాజన్నసిరిసిల్ల జిల్లాలోని చందుర్తిమండలంలో కాంగ్రెస్‌ ప్రజా చైతన్య సభలో కాంగ్రెస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డిమాట్లాడారు. తెలంగాణలో లక్ష ఉద్యోగాలు రావాలంటే కేసీఆర్‌ ఉద్యోగం ఊడగొట్టాలని రేవంత్‌ యువతకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్‌ పై తీవ్ర ఆరోపణలు చేశారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి చెన్నమనేని రమేష్ బాబు గెలిచినా, ఓడినా ఆయన జర్మనీలోనే ఉంటారని ఎద్దేవా చేశారు. కేవలం సెలవుల్లోనే ఆయన ఇక్కడకు వస్తారన్నారు. తెలంగాణ ఇచ్చిన దేవత అని సోనియా గాంధీ అని స్వయంగా కేసీఆరే అన్నారని, తెలంగాణ కోసం ప్రాణత్యాగాలు చేసిన 1569 అమరుల కుటుంబాలకు కేసీఆర్‌ ఏం న్యాయం చేశారని ఈ సందర్భంగా రేవంత్‌ ప్రశ్నించారు. సమగ్ర కుటుంబ సర్వేతో ఏం సాధించారని ప్రశ్నించారు. తెలంగాణ అమరవీరుల వివరాల కోసం ఒక్క కాలమ్‌ కూడా అందులో కేటాయించలేదని.. పైగా, కుటుంబంలో కోళ్లు, కుక్కలు ఎన్ని ఉన్నాయన్న వివరాలు అడిగారని మండిపడ్డారు. తెలంగాణ ద్రోహులైన తలసాని, తుమ్మలకు మంత్రి పదవి ఇచ్చి.. దానం నాగేందర్‌కు ఎమ్మెల్యే టికెట్‌ ఇచ్చారని దుయ్యబట్టారు. మందుపోసిన సంతోష్‌కు పదవి ఇచ్చారని విమర్శించారు. నిత్యం ప్రజల్లో ఉన్న కాంగ్రెస్‌ అభ్యర్థి ఆది శ్రీనివాస్‌ను గెలుపించాలని విజ్ఞప్తి చేశారు.

6 25

తెలంగాణ ఉద్యమంలో ఒక్క దొరైనా బలిదానం చేసుకున్నాడా? అని ప్రశ్నించారు. త్యాగాల పునాదులపై ఏర్పడిన తెలంగాణను రాబందుల్లా పీక్కుతింటున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రాజెక్టుల రీడిజైన్ల పేరిట కోట్ల రూపాయలు కొల్లగొట్టారని ఆరోపించారు. ప్రపంచ చరిత్రలోనే స్వాతంత్ర్యం కోసం పోరాటాలు చేసిన వారెవరూ ఆస్తులు కూడబెట్టుకోలేదని, కేసీఆర్‌ మాత్రం వేల కోట్లు సంపాదించారని ఆరోపించారు. తెలంగాణను ఎవరు అభివృద్ధి చేశారనే అంశంపై అమరవీరుల స్తూపం వద్ద హరీశ్‌రావు, కేటీఆర్‌ చర్చకు సిద్ధమా? అని సవాల్‌ విసిరారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల కోసం రూ.2లక్షల కోట్లు ఖర్చు చేశారని, ఆ నిధులు ఎక్కడికి పోయాయన్నారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే 58 ఏళ్లు నిండిన భార్యా భర్తలకు ఒక్కొక్కరికి రూ.2వేలు చొప్పున పింఛను ఇస్తామని హామీ ఇచ్చారు. మహిళల్ని లక్షాధికారులుగా మారుస్తామన్నారు. సభ సాక్షిగా సిరిసిల్ల నియోజక వర్గాన్ని దత్తత తీసుకుంటున్నానని రేవంత్ ప్రకటించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu