Leela Vinodham OTT Review:
‘లీలా వినోదం’ ఒక పల్లెటూరి ప్రేమకథ. ఇది ఈటీవీ విన్ ప్లాట్‌ఫామ్‌లో ప్రసారం అవుతోంది. ఈ చిత్రంలో షణ్ముఖ్ జస్వంత్, అనఘ అజిత్ ప్రధాన పాత్రల్లో నటించారు. పవన్ సుంకర దర్శకత్వం వహించిన ఈ చిత్రం, 2000ల మధ్యకాలంలో మొబైల్ ఫోన్లు కొత్తగా వచ్చిన సమయం బ్యాక్ డ్రాప్ లో సాగుతుంది.
కథ:
ప్రసాద్ (షణ్ముఖ్ జస్వంత్) ఒక సాధారణ యువకుడు, తన కాలేజీ రోజుల్లో లీలా (అనఘ అజిత్)పై ప్రేమ పెంచుకుంటాడు. అయితే, తన ప్రేమను వ్యక్తం చేయడానికి ధైర్యం చేయలేకపోతాడు. చివరకు, మొబైల్ సందేశాల ద్వారా లీలా తో స్నేహం ఏర్పరచుకుంటాడు. ఒక మేసేజ్ కి లీలా నుండి వెంటనే స్పందన రాకపోవడంతో, ప్రసాద్ ఆందోళన చెందుతాడు. ఈ నేపథ్యంలో, వారి సంబంధం ఎలా ముందుకు కదిలింది అనేది సినిమా కథ.
నటీనటులు:
షణ్ముఖ్ జస్వంత్ ప్రసాద్ పాత్రలో తన సహజ నటనతో ఆకట్టుకుంటాడు. అనఘ అజిత్ లీలా పాత్రలో తక్కువ స్క్రీన్ టైమ్ ఉన్నప్పటికీ, తన పాత్రకు న్యాయం చేసింది. ప్రసాద్ స్నేహితులుగా నటించిన ఆర్జే మిర్చి శరణ్ (రాజి), ఇతరులు తమ పాత్రలను బాగా పోషించారు. అనుభవజ్ఞులైన ఆమని, గోపరాజు రమణ వంటి నటులు చిత్రంలో పెద్దగా ప్రభావం చూపలేదు.
View this post on Instagram
సాంకేతిక అంశాలు:
టిఆర్ కృష్ణ చేతన్ సంగీతం కథకు అనుగుణంగా ఉంది. అనుశ్ కుమార్ సినిమాటోగ్రఫీ తో పల్లెటూరి సౌందర్యాన్ని అందంగా చూపించారు. ఎడిటింగ్, స్క్రీన్‌ప్లే మరింత మెరుగ్గా ఉండి ఉంటే బాగుండేది.
ప్లస్ పాయింట్లు:
*పల్లెటూరి నేపథ్యం
*సహజమైన నటన
*నాస్టాల్జియా ఫీలింగ్
మైనస్ పాయింట్లు:
-నెమ్మదిగా సాగే కథనం
-స్లో నేరేషన్
-కామెడీ సరిగ్గా పండకపోవడం
తీర్పు:
లీలా వినోదం ఒక అందమైన పల్లెటూరి ప్రేమకథ. కథనం కొంచెం నెమ్మదిగా ఉన్నప్పటికీ, పల్లెటూరి జీవన శైలి, ప్రేమ భావాలను సున్నితంగా చూపించింది. పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకోవాలనిపించే ప్రేక్షకులు ఈ చిత్రం ఒకసారి చూడచ్చు.
రేటింగ్: 2.75/5
ALSO READ: 2024 లో Tollywood నుండి మాయమైపోయిన స్టార్ హీరోయిన్!