రివ్యూ: ఇంకొక్కడు

నటీనటులు: విక్రమ్, నయనతార, నిత్యమీనన్, నాజర్ తదితరులు
సంగీతం: హారీశ్ జయరాజ్
ఫోటోగ్రఫి: రాజశేఖర్
నిర్మాతలు: శిబూ తమీన్స్, కృష్ణారెడ్డి
దర్శకత్వం: ఆనంద్ శంకర్
పాత్రల కోసం ఎంత రిస్క్ అయినా చేసే నటుల్లో చాలా అరుదుగా మనకు కనపడతారు. అటువంటి హీరోల్లో చియాన్ విక్రమ్ ఒకరు. ఏ పాత్ర చేసినా అందలో జీవించే ప్రయత్నం చేస్తుంటారాయన. విలక్షణతకు పట్టం కట్టే తెలుగు ప్రేక్షకులు అందుకే చియాన్ విక్రమ్
అంటే అభిమానాన్ని ఏర్పరుచుకున్నారు. ఇలాంటి విలక్షణ నటుడు మన ముందుకు ‘ఇంకొక్కడు’గా వచ్చాడు. మరి ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో.. సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం!
కథ:
అఖిలన్(విక్రమ్) ఇండియన్ RAW డిపార్ట్మెంట్ లో పని చేసేవాడు. కానీ కొన్ని కారణాల వలన నాలుగేళ్లుగా ఆ డిపార్ట్మెంట్ కు దూరంగా గడుపుతూ ఉంటాడు. అయితే లవ్ లవ్(విక్రమ్) అనే వ్యక్తి ఇండియన్ ఎంబసీను నాశనం చేయడానికి ‘స్పీడ్ వెర్షన్ 2’ అనే మందును కనిపెడతాడు. నిజానికి ఈ మందు తీసుకున్న వారికి తెలియని బలం, ధైర్యం వచ్చేస్తుంది. దాంతో ఎదుటివారిని సులభంగా ఎదిరించగలరు. సాధారణంగా అందరూ ఉపయోగించే ఇన్హేలర్ లలో ఆ మందును స్టోర్ చేసి దాన్ని ఇండియాకు పంపించి అందరినీ నాశనం చేయడానికి డీల్ చేసుకుంటాడు లవ్. ఈ ఆపరేషన్ ను ఒక్క అఖిలన్ మాత్రమే ఆపగలడని తనను కలవడానికి సీనియర్ ఆఫీసర్స్ వెళతారు. అయితే లవ్ ను అఖిలన్ చంపేశాననే భ్రమలో ఉండడం వలన ఆఫీసర్స్ చెప్పింది మొదట నమ్మడు. కానీ నిజంగానే లవ్ బ్రతికి ఉన్నాడని తెలుసుకొని ఆరూహి(నిత్యమీనన్) అనే ఆఫీసర్ తో కలిసి లవ్ చేస్తోన్న ప్లాన్ ను నాశనం చేయడానికి బయలుదేరతాడు. మరి ఫైనల్ గా అఖిలన్, లవ్ ను చంపగలిగాడా..? అసలు లవ్ మీద అఖిలన్ కు ఉన్న పగ ఏంటి..? నయనతార, నిత్యమీనన్ ల పాత్రలు ఎలా ఉండబోతున్నాయి..? అనే అంశాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే!
ప్లస్ పాయింట్స్:
నేపధ్య సంగీతం
ఫోటోగ్రఫి
మైనస్ పాయింట్స్:
మొదటి భాగం, రెండో భాగంలలో ల్యాగ్
కథను నడిపించిన తీరు
విశ్లేషణ:
రెగ్యులర్ గా వచ్చే కమర్షియల్ చిత్రాలకు కాస్త భిన్నంగా ఈ సినిమా ఉంటుంది. కొత్త పాయింట్, కొత్త కథనంలో సినిమాను ప్రెజంట్ చేయాలనుకున్నారు. డైరెక్టర్ అనుకున్న పాయింట్ బావున్నప్పటికీ దాన్ని సరిగ్గా ఎగ్జిక్యూట్ చేయలేకపోయారు. అయినప్పటికీ
కథ మీద పూర్తి క్లారిటీ ఉండటంతో ప్రేక్షకులకు పూస గుచ్చినట్లుగా వివరించి చెప్పాడు. మెయిన్ కాన్సెప్ట్ కు కొన్ని అనవరమైన సన్నివేశాలు జత కావడంతో అక్కడక్కడా బోర్ ఫీల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. పాటలు కూడా అంత గొప్పగా లేవు కానీ
నేపధ్య సంగీతం మాత్రం సినిమాకు ప్లస్ అయింది. లవ్ గా, అఖిలన్ గా విక్రమ్ కనబరిచిన నటన అధ్బుతం. ఒకేసారి రెండు వేరియెషన్స్ ను చూపించగలిగాడు. నయనతార కూడా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా చక్కగా నటించింది. నిత్యమీనన్ మాత్రం సో.. సో.. గా అనిపిస్తుంది. యాక్షన్ సీక్వెన్సెస్ ను బాగా డిజైన్ చేశారు. ఫోటోగ్రఫి మరో అసెట్ అయింది. ఎడిటర్ మాత్రం తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సివుంది. బి, సి ఆడియన్స్ ను మెప్పించే ఫైట్స్ ఈ సినిమాలో ఉంటాయి. అలానే మల్టీప్లెక్స్ ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యే కొన్ని సన్నివేశాలు కూడా ఉన్నాయి.
రేటింగ్: 2.5/5

CLICK HERE!! For the aha Latest Updates