రివ్యూ: మన ఊరి రామాయణం

నటీనటులు: ప్రకాష్ రాజ్, ప్రియమణి, సత్యదేవ్, పృధ్వీ తదితరులు
సంగీతం: ఇళయరాజా
సినిమాటోగ్రఫీ: ముకేష్
ఎడిటింగ్: శ్రీకర్ ప్రసాద్
దర్శకత్వం, నిర్మాణం: ప్రకాష్ రాజ్
విలక్షణ నటుడు ప్రకాష్ ఎన్నో హిట్ చిత్రాల్లో నటించాడు. కొన్ని పాత్రలు కేవలం ఆయన కోసమే
రాసుకుంటారని చెప్పడంలో అతిసయోక్తి లేదు. నటుడిగానే కాకుండా.. మెగా ఫోన్ పట్టి
ధోని, ఉలవచారు బిరియాని వంటి చిత్రాలను రూపొందించారు. ఆ చిత్రాలు ప్రేక్షకుల వరకు
రీచ్ కానప్పటికీ ప్రకాష్ రాజ్ లో మంచి కథకుడు ఉన్నాడని తెలిపాయి. అదే నమ్మకంతో
మరోసారి తన కలానికి పదును పెట్టి ‘మన ఊరి రామాయణం’ అంటూ ప్రేక్షకుల ముందుకు
వచ్చారు. ఈ సినిమాలో ఆయన ప్రధాన పాత్రలో నటించడం విశేషం. మరి ఈ చిత్రం ప్రేక్షకులకు
ఎంతవరకు రీచ్ అయిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం!
కథ:
భుజంగయ్య(ప్రకాష్ రాజ్) దుబాయి రిటర్న్.. అక్కడ బాగా డబ్బు సంపాదించి తన సొంతూరులో
పెద్ద మనిషిగా చెప్పుకొని తిరుగుతూ ఉంటాడు. ఇంట్లో కూడా తన పెత్తనాన్ని చూపిస్తూ ఉంటాడు.
వూర్లో శ్రీరామనవమి సంబరాలు జరుగుతూ ఉంటాయి. ఆ పనులను భుజంగయ్య ప్రతి ఏడాది
దగ్గరుండి చూసుకుంటూ ఉంటాడు. అయితే స్నేహితులతో కలిసి తాగిన మత్తులో రోడ్ మీద
ఒక వేశ్యను(ప్రియమణి)చూసి తనతో కలిసి ఉండాలని భావిస్తాడు. భుజంగయ్యకు నమ్మకస్తుడైన
శివ(సత్యదేవ్) ఆటోలో ఆ వేశ్యను తన షాప్ కి తీసుకువెళ్తాడు భుజంగయ్య. షాప్ కి లాక్
వేసి వెళ్ళిన శివ ఎంతసేపటికీ రాడు. దీంతో భుజంగయ్యకు వూర్లో పరువు పోతుందనే టెన్షన్
మొదలవుతుంది. అసలు శివ ఎందుకు తిరిగిరాలేదు..? చివరకు భుజంగయ్య పరిస్థితి ఏమవుతుంది..?
సినిమాలో పృధ్వీ, రఘుబాబుల పాత్రలు ఎలా ఉండబోతున్నాయి..? అనే అంశాలతో సినిమా
నడుస్తుంది.
ప్లస్ పాయింట్స్:
కథ
ఫోటోగ్రఫీ
నేపధ్య సంగీతం
ఎడిటింగ్
ప్రకాష్ రాజ్, ప్రియమణి
మైనస్ పాయింట్స్:
ఫస్ట్ హాఫ్
విశ్లేషణ:
ప్రతి మనిషిలో రెండు వ్యక్తిత్వాలు ఉంటాయి. ఒకరు రాముడైతే మరొకరు రావణుడు.. సరిగ్గా
ఇదే కాన్సెప్ట్ తో సినిమా చేశాడు ప్రకాష్ రాజ్. మనిషి ఉన్నప్పుడు తన గురించి చుట్టూ ఉండే
వారు ఎలా మాట్లాడుకుంటారు.. లేకపోతే తన వెనుక ఎలా మాట్లాడతారు అనే విషయాలను
తెరపై ఆవిష్కరించాడు. నిజాయితీగా మనల్ని ప్రేమించేది మన కుటుంబమే.. అనే సీన్స్ ను
బలంగా చూపించారు. ఓ వేశ్య వలన వ్యక్తి జీవితం, తన ఆలోచన విధానం ఏవిధంగా మారిందనే
సన్నివేశాలను చక్కగా ప్రెజంట్ చేశారు. దానికి తగ్గ నేపధ్య సంగీతం ప్రతి సీన్ ను ఎలివేట్ చేసింది.
ప్రేక్షకులకు విసుగు తెప్పించకుండా.. ఎడిటింగ్ చాలా క్రిస్పీగా చేశారు ఫోటోగ్రఫి పర్వాలేదనిపిస్తుంది.
పూర్తిగా విలేజ్ బ్యాక్ డ్రాప్ లో నడుస్తుంది. సినిమాలో ప్రకాష్ రాజ్, ప్రియమణిల నటన కథను
మరోస్థాయికి తీసుకెళ్లింది. ఆటో డ్రైవర్ గా సత్యదేవ్ ఒదిగిపోయాడు. ఇప్పటివరకు ఏ సినిమాలో
చూడని విధంగా ఈ సినిమాలో పృధ్వీ పాత్ర ఉంటుంది. సీరియస్ గా ఉంటూనే ఎంటర్టైన్ చేస్తాడు.
ఇలాంటి కథల్లో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసే విధంగా డైలాగ్స్ రాసుకున్నారు. సినిమా మొదలైన
20 నిమిషాలు బోర్ కొట్టినప్పటికీ తరువాత కథకు కనెక్ట్ అవ్వడంతో కథను ఎంజాయ్ చేస్తారు.
రెగ్యులర్ గా పాటలు, ఫైట్స్, రొటీన్ కథను కోరుకునే ప్రేక్షకులకు మాత్రం ఈ సినిమా పెద్ద్గగా
నచ్చదు. కథలో కొత్తదనాన్ని కోరుకునే ప్రేక్షకులకు మాత్రం ఈ సినిమా ఒకసారి చూడొచ్చు.
రేటింగ్: 3/5

CLICK HERE!! For the aha Latest Updates