Satyadev Zebra Movie Review:
టాలెంటెడ్ నటుడు సత్యదేవ్ ప్రధాన పాత్రలో నటించిన క్రైమ్ థ్రిల్లర్ ‘జీబ్రా’, ఈశ్వర్ కార్తిక్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆర్థిక నేరాల నేపథ్యంలో సాగే ఈ సినిమా, కన్నడ నటుడు దళి ధనంజయ ముఖ్యపాత్రలో ఆకట్టుకుంది. ఆసక్తికరమైన కథ, మంచి నటనతో ప్రేక్షకులను ఎంత వరకు మెప్పించిందో ఇప్పుడు చూద్దాం.
కథ:
సూర్య (సత్యదేవ్) ఒక బ్యాంక్ ఉద్యోగి. అతను స్వాతి (ప్రియ భవానీ శంకర్) అనే అమ్మాయిని ప్రేమిస్తుంటాడు. కానీ తన తల్లిదండ్రులకు ఈ విషయాన్ని చెప్పడానికి వెనుకడుగు వేస్తాడు. ఒక రోజు స్వాతి అనుకోని సమస్యలో చిక్కుకుంటుంది. ఒకరోజు ఆమెను కాపాడటానికి ప్రయత్నించగా సూర్య మరింత పెద్ద సమస్యలో చిక్కుకుంటాడు. అతను నాలుగు రోజుల్లో ఆది (దళి ధనంజయ)కు 5 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. సాదా బ్యాంక్ ఉద్యోగి అయిన సూర్య ఇంత పెద్ద మొత్తం ఎలా సమకూర్చాడు? అతను తీసుకున్న కీలక నిర్ణయాలు, ఆర్థిక నేరాల చుట్టూ ఈ కథ తిరుగుతుంది.
నటీనటులు:
సత్యదేవ్ తన పాత్రలో అద్భుతంగా ఒదిగిపోయారు. కష్టాల మధ్యలో తన భావోద్వేగాలను బాగా చూపించారు. దాలి ధనంజయ తన పవర్‌ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఆకట్టుకున్నారు. హీరోయిన్ ప్రియ భవానీ శంకర్ తన పాత్రకు న్యాయం చేశారు. సీనియర్ నటుడు సత్యరాజ్ బాబా పాత్రలో మెప్పించారు. హాస్యనటుడు సత్య తన డైలాగ్స్, బాడి లాంగ్వేజ్ తో బాగానే కామెడీ పండించారు. ఇతర నటులు అమృత అయ్యంగార్ తదితరులు తమ పాత్రలకు సరైన న్యాయం చేశారు.
#SatyaDev’s #Blockbuster Come Back #Zebra 🔥🔥🔥 pic.twitter.com/JS07h1VJMY
— IndustryHit.Com (@industry_hit) November 22, 2024
సాంకేతిక అంశాలు:
దర్శకుడు ఈశ్వర్ కార్తిక్ కొత్తదనాన్ని చూపించినప్పటికీ, స్క్రీన్‌ప్లే కొంత బలహీనంగా అనిపిస్తుంది. సంగీత దర్శకుడు రవి బస్రూర్ అందించిన పాటలు ప్రభావం చూపించలేకపోయాయి. కీలక సన్నివేశాల్లో నేపథ్య సంగీతం కూడా ఆకట్టుకోలేదు. సినిమాటోగ్రాఫర్ సత్య పొన్మార్ అందించిన విజువల్స్ మంచి అనుభూతి కలిగించాయి. ఎడిటింగ్ మరింత బాగా చేస్తే కథకు మంచి ఫ్లో వచ్చేది. నిర్మాణ విలువలు సంతృప్తికరంగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్:
*ఆసక్తికరమైన కథ
*సత్యదేవ్, ధనంజయ మధ్య సన్నివేశాలు
*కొన్ని హాస్యభరిత సన్నివేశాలు
*నటీనటులు
మైనస్ పాయింట్స్:
-స్క్రీన్‌ప్లే
-కీలక సన్నివేశాలలో లాజిక్ లోపం
-హీరో పాత్ర స్ట్రాంగ్ గా లేకపోవడం
-బ్యాగ్రౌండ్ స్కోర్
తీర్పు:
‘జీబ్రా’ కథ, బాగానే ఆకట్టుకుంటుంది. కొంత వరకు థ్రిల్ ఇవ్వగలిగే ఈ సినిమా, కొన్ని బోరింగ్ సన్నివేశాల వల్ల ఆసక్తిని పూర్తిగా అలరించలేకపోయింది. ఫైనాన్స్ సంబంధిత నేరాల నేపథ్యంలో ఆసక్తికరమైన క్రైమ్ డ్రామాగా ఈ సినిమాను ఒకసారి చూడచ్చు.
రేటింగ్: 2.75/5
ALSO READ: అలియా భట్ నటించిన Jigra సినిమా ఓటిటి లో ఎప్పటినుండి చూడచ్చంటే!