రివ్యూ: ప్రేమమ్

నటీనటులు: నాగచైతన్య, శృతిహాసన్, మడోనా సెబాస్టియన్, అనుపమ పరమేశ్వరన్, జీవా, బ్రహ్మాజీ, నర్రాశ్రీను, ప్రవీణ్ తదితరులు..
సమర్పణ: పి.డి.వి. ప్రసాద్
నిర్మాత: సూర్యదేవర నాగవంశీ
సంగీతం; గోపిసుందర్, రాజేష్ మురుగేషన్
చాయా గ్రహణం: కార్తీక్ ఘట్టమనేని
ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వర రావు
స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: చందు మొండేటి
చైతన్య అక్కినేని, శ్రుతిహాసన్,మడొన్నాసెబాస్టియన్,అనుపమ పరమేశ్వరన్ ల కాంబినేషన్ లో,
దర్శకుడు ‘చందు మొండేటి దర్శకత్వంలో యువ నిర్మాత సూర్యదేవర నాగవంశీ ‘సితార
ఎంటర్ టైన్మెంట్స్’ పతాకంపై పి.డి.వి ప్రసాద్ సమర్పణలో నిర్మించిన చిత్రం ‘ప్రేమమ్’. ఈరోజు
ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో రివ్యూలోకి వెళ్లి
తెలుసుకుందాం!
కథ:
విక్రమ్(నాగచైతన్య) స్కూల్ డేస్ లో ఉన్నప్పుడే సుమ(అనుపమా పరమేశ్వరన్) అనే
అమ్మాయిని ఇష్టపడతాడు. అదే ప్రేమ అనుకొని తన వెంట పడుతుంటాడు. అయితే సుమ
వేరే అబ్బాయిని ప్రేమిస్తుందని తెలిసి తప్పుకుంటాడు. కొన్నేళ్ళ తరువాత ఇంజనీరింగ్ చదివేప్పుడు
సితార(శృతిహాసన్) అనే లెక్చరర్ ను ప్రేమించడం మొదలుపెడతాడు విక్రమ్. సితార కూడా
విక్రమ్ ను ఇష్టపడుతుంది. అయితే ఆమెకు యాక్సిడెంట్ జరగడం వలన గతాన్ని మర్చిపోతుంది.
ఏం చేయాలో తోచని పరిస్థితుల్లో ఉన్న విక్రమ్ తన ప్రేమను ఓ జ్ఞాపకంగా మార్చుకొని తను
సరదాగా చేసే వంటను ప్రొఫెషన్ గా చేసుకొని ఓ రెస్టారంట్ మొదలుపెడతాడు. కొన్ని రోజులకు
విక్రమ్ జీవితంలోకి సింధు(మడోనా సెబాస్టియన్) ఎంటర్ అవుతుంది. విక్రమ్ ఈసారైనా తన
ప్రేమలో గెలుస్తాడా..? లేకపోతే గత రెండు ప్రేమ కథల్లానే సింధు కూడా తనను వదిలేసి
వెళ్లిపోతుందా..? అనే అంశాలతో సినిమా నడుస్తుంది.
ప్లస్ పాయింట్స్:
ఆర్టిస్టుల పెర్ఫార్మన్స్
సంగీతం
కథ, కథనాలు
ఫోటోగ్రఫీ
మైనస్ పాయింట్స్:
శృతిహాసన్
కొన్ని సన్నివేశాలు
విశ్లేషణ:
మలయాళం వచ్చిన ‘ప్రేమమ్’ సినిమాకు ఇది రీమేక్. అయితే డైరెక్టర్ మాత్రం కథను ఓన్
చేసుకొని చక్కగా తెరకెక్కించాడు. తెలుగు నేటివిటీకు తగ్గట్లు కథలో కొన్ని మార్పులు చేశాడు.
ఖచ్చితంగా మలయాళం సినిమా చూడని ప్రతి ప్రేక్షకుడికి ఈ సినిమా నచ్చుతుంది. చూసిన
వారికి మాత్రం ఆ రేంజ్ లో లేదనే ఫీలింగ్ కలగొచ్చు. దర్శకుడు చందు మొండేటి మాత్రం కథను
వీలైనంతగా ప్రేక్షకుల పాయింట్ ఆఫ్ వ్యూలోనే రూపొందించాడు. ఇటువంటి యూత్ ఫుల్ కథలు
తెలుగులో వచ్చి చాలా కాలం అయింది. ప్రతి మనిషిలో ఉండే మూడు దశలు తెరపై చక్కగా
ఆవిష్కరించారు. ఈ సినిమా పెద్ద అసెట్ గోపి సుందర్ పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్. మలయాళం
ఫ్లేవర్ కనిపించినప్పటికీ ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు. ఫోటోగ్రఫీ సినిమాకు మరో ప్లస్. బలమైన
టెక్నీషియన్స్ ఉండడంతో కథను బాగా ఎలివేట్ చేయగలిగారు. ఎడిటింగ్ కూడా క్రిస్పీగా ఉంది.
నాగచైతన్య తన లుక్ తో ఆకట్టుకున్నాడు. టీనేజ్ లో ఉండే అతడి లుక్ కోసం చాలా హోంవర్క్
చేసినట్లు ఉన్నాడు. వయసు పెరిగిన తరువాత గడ్డంతో చాలా రఫ్ గా కనిపించాడు. అనుపమా,
మడోనా సెబాస్టియన్ లు తమ లుక్స్ తో, హావభావాలతో ఓ మార్క్ ను క్రియేట్ చేసుకున్నారు.
అయితే శృతిహాసన్ క్యారెక్టర్ తనకు అంత సెట్ కాలేదనిపిస్తుంది. ఆ విషయంలో మరింత
కేర్ తీసుకొని ఉంటే బావుండేది. ప్రవీణ్, శ్రీనివాస్ రెడ్డిల కామెడీ పండింది. ఒక ఫ్రేమ్ లో
వెంకటేష్, క్లైమాక్స్ సన్నివేశాల్లో నాగార్జున కనిపించి ప్రేక్షకులను సర్ప్రైజ్ చేస్తారు. మొత్తానికి
యూత్ తో పాటు ఫ్యామిలీస్ కూడా ఈ సినిమాను హాయిగా చూడొచ్చు.
రేటింగ్: 3.25/5

CLICK HERE!! For the aha Latest Updates