HomeTelugu Trendingఆర్జీవీ-అరియానా వర్కవుట్‌ ఫొటో వైరల్‌

ఆర్జీవీ-అరియానా వర్కవుట్‌ ఫొటో వైరల్‌

RGV and ariyana work out pi

వివాదాస్పద దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మని ఇంటర్వ్యూ చేయడంతో అరియానా ఒక్కసారిగా పాపులర్ అయింది. అరియానా డ్రెస్సింగ్, ఆమె తొడల మీద అరియానా చేసిన కామెంట్స్‌, ఆమె సిగ్గుపడిన సందర్భం అవన్నీ కూడా సోషల్‌ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. బోల్డ్ ఇంటర్వ్యూతో అరియానా మంచి క్రేజ్‌ తెచ్చుకుంది. ఆ ఇంటర్వ్యూతో వచ్చిన గుర్తింపే బిగ్ బాస్ షో వరకు అరియానాను తీసుకొచ్చింది. వర్మ అరియానా కోసం బిగ్‌బాస్‌ ఒక్క ఎపిసోడ్‌ను చూసినట్టున్నారు. చివరి రోజుల్లో అరియానాను సపోర్ట్ చేయండంటూ వర్మ మద్దతు కూడా పలికారు. మామూలుగా అలాంటి విషయాల్లో ఎక్కువ తలదూర్చని వర్మ.. అరియానా కోసం కదిలి వచ్చారు.

తాజాగా అరియానా ఆర్జీవీలు కలుసుకున్నారు. అయితే వర్మను ఇంటర్వ్యూ చేసేందుకు అరియానా వెళ్లారట.ఈ మధ్య వర్మ వర్కవుట్లు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. కండలు పెంచడంలో ఎంతో బిజీగా ఉన్న వర్మ.. జిమ్ ఏరియాలోనే ఎన్నో ఇంటర్వ్యూలు ఇచ్చారు. తాజాగా అరియానాతో ఇంటర్వ్యూ పూర్తయ్యాక ఇలా ఇద్దరం కలిసి వర్కవుట్లు చేశామని ఓ ఫొటోను షేర్ చేశారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu