డ్రగ్స్ మత్తులో ముగ్గురు తారలు!

టాలీవుడ్ లో కలకలం రేపిన డ్రగ్స్ వ్యవహారం కొంతకాలంగా తెరమరుగు అయినట్లుగా కనిపిస్తోంది. పోలీసులకు చిక్కిన డ్రగ్స్ డీలర్లతో సంబంధాలు కలిగిన పలువురు సినీ తారలను సిట్ అధికారులు విచారించారు. ఈ విషయం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. పలువురు సినీప్రముఖులు సిట్ అధికారుల ముందు హాజరైన తమ వివరణను ఇచ్చారు. సిట్ విచారణకు హాజరైన సినీ ప్రముఖులు ఎవరూ కూడా అరెస్ట్ కాలేదు. ఎవరి సినిమాలతో వారు బిజీ అయిపోయారు. దీంతో ఇక ఈ వ్యవహారం ముగిసిపోయిందని అంతా అనుకున్నారు. అయితే ఈ కేసు విచారణను మళ్ళీ కొనసాగిస్తుందట ఎక్సైజ్ శాఖ.
 
ఈ క్రమంలో డ్రగ్స్ కు బానిసలుగా మారిన ముగ్గురు సెలబ్రిటీలను వారు గుర్తించినట్లుగా తెలుస్తోంది. వీరిలో ప్రాముఖ్య హీరోయిన్ కూడా ఉందని సమాచారం. మాదక ద్రవ్యాలకు ఆమె బానిసగా మారిందని తెలుస్తోంది. ఆమె డ్రగ్స్ ఎక్కువ మోతాదులో తీసుకున్నప్పుడు తీసిన వీడియోలను కూడా పోలీసులు సేకరించారు. ఆమెతో పాటు మరో ఇద్దరు నటులను కూడా డ్రగ్స్ వినియోగదారులుగా గుర్తించారట. ఇది వరకు కొంతమంది నటులను విచారించినప్పుడు కూడా ఈ ముగ్గురు పేర్లు ప్రస్తావనకు వచ్చాయట.