నాపై కాదు అన్నగారిపై కేసుపెట్టిండి: వర్మ

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన కొత్త చిత్రం ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రం నుండి ‘వెన్నుపోటు’ సాంగ్‌ను మొన్న రిలీజ్ చేయగా అది కాస్త టీడీపీ వర్గాల్లో కలకలం రేకెత్తించింది. ఆ పాటలో వర్మ నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కించపరుస్తూ లిరిక్స్ ఉన్నాయని, అందులో ఏదో రాజకీయ కుట్ర దాగుందని పలువురు టీడీపీ నేతలు వర్మపై కేసులు పెట్టారు.

దీనికి స్పందించిన వర్మ తాను పాటలో చంద్రబాబును నేరుగా ఒక్క మాట కూడ అనలేదని, అలాంటి తనపై కేసులు పెడితే ఒకప్పుడు చంద్రబాబును నేరుగా తిట్టిన పెద్ద ఎన్టీఆర్ మీద ఎన్ని కేసులు పెట్టాలి అంటూ ఎన్టీఆర్ బాబును గురించి మాట్లాడుతున్న ఒక వీడియోని సైతం షేర్ చేశారు. ఇది కూడ ఇప్పుడు సంచలనంగా మారుతోంది.