HomeTelugu Big Storiesకమ్యూనిస్టు పార్టీలో చేరనున్న జాకీ చాన్‌!

కమ్యూనిస్టు పార్టీలో చేరనున్న జాకీ చాన్‌!

Jackie chan wants to join c
హాలీవుడ్‌ అగ్ర నటుడు, దర్శకుడు, మార్షల్‌ ఆర్ట్స్‌ నిపుణుడు జాకీ చాన్‌ కమ్యూనిస్టు పార్టీలో ఆఫ్‌ చైనా(సీపీసీ) లో చేరనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తమ దేశ మీడియాతో పంచుకున్నారు. తనకు ‘సీపీసీ’లో చేరాలని ఉందంటూ ఆ దేశ అధికారిక పత్రిక ‘గ్లోబల్‌ టైమ్స్‌’ చర్చలో ఆయన పేర్కొన్నారు.

జూలై 1వ తేదీన సీపీసీ వంద వసంతాలు పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. శత వసంతాల వేడుకలో భాగంగా ఆ దేశ అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ కీలక ప్రసంగం చేశారు. ఈ ప్రసంగంపై మంగళవారం (జూలై 6) ఆ దేశ సినీ ప్రముఖులతో చర్చా కార్యక్రమం నిర్వహించారు. ఆ చర్చలో చైనా ఫిలిం అసోసియేషన్‌ ఉపాధ్యక్షుడిగా ఉన్న జాకీచాన్‌ పై వ్యాఖ్యలు చేశారు. చైనా కమ్యూనిస్టు పార్టీ (సీపీసీ) వందేళ్లల్లో ఏం చెప్పిందో అది చేసి చూపించిందని కొనియాడారు. అది కూడా కొన్ని దశాబ్దాల్లోనే పూర్తి చేసిందని చెప్పారు. ఈ క్రమంలోనే తాను కొన్నేళ్లుగా ఆ పార్టీకి మద్దతుదారుగా ఉన్నట్లు తెలిపారు. గతంలో జాకి చాన్‌చైనా పీపుల్స్‌ పొలిటికల్‌ కన్సల్టేటివ్‌ కాన్ఫరెన్స్‌ (సీపీపీసీసీ)లో సభ్యుడిగా పని చేశారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu