HomeTelugu Trendingఉత్కంఠబరితంగా 'హీరో' ట్రైలర్‌

ఉత్కంఠబరితంగా ‘హీరో’ ట్రైలర్‌

Rishab shetty hero movie tr

ఇతర భాషల్లో విజయం అందుకున్న చిత్రాల్ని ప్రముఖ ఓటీటీ ‘ఆహా’ డబ్‌ చేసి తెలుగు ప్రేక్షకులకి వినోదం పంచుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కన్నడ సినిమా ‘హీరో’ని అదే పేరుతో జులై 24 నుంచి అందుబాటులోకి తీసుకురానుంది. రిషబ్‌ శెట్టి హీరోగా నటించిన ఈ సినిమాకి ఎం. భరత్‌ రాజ్‌ దర్శకత్వం వహించాడు. గనవి లక్ష్మణ్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. ప్రమోద్‌ శెట్టి విలన్‌గా నటిస్తున్న ఈ మూవీ ట్రైలర్‌ తాజాగా విడుదలైంది.

‘దట్టమైన అడవులతో నిండిన లంక ఇది’ అనే డైలాగ్‌తో ప్రారంభమైన ఈ ట్రైలర్‌ ఉత్కంఠ పెంచుతూనే నవ్వులు పంచుతుంది. ఇందులో హీరో బార్బర్‌గా కనిపించాడు. క్షౌరం చేసేందుకు విలన్ ప్రమోద్‌ ఇంటికి వెళ్తాడు రిషబ్‌. ప్రమోద్‌ భార్య (హీరోయిన్‌), రిషబ్‌కి మధ్య పరిచయం ఉండటంతో ఇద్దరూ దగ్గరవుతారు. అదే సమయంలో విలన్‌ కంట పడతారు. విలన్‌ గ్యాంగ్‌తో ‘హీరో’ పోరాటాలు, ఛేజింగులు మొదలవుతాయి. చివరిలో ‘నువ్వు వచ్చిన పని ముగించకుండానే వెళ్తావా’ అని హీరోని హీరోయిన్‌ అడగటం ఉత్కంఠ పెంచింది. దాంతో ఇంతకీ హీరో పగకి కారణమేంటి? అనే సందేహం కలుగుతుంది. హీరో.. హీరోయిన్‌ గొంతు కోసే సన్నివేశం మరో ట్విస్ట్‌. నటీనటుల హావభావాలు ఆకట్టుకుంటున్నాయి. నేపథ్య సంగీతం ప్రధాన బలంగా నిలిచింది. మరి ‘హీరో’ పగ ఏంటి? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

Recent Articles English

Gallery

Recent Articles Telugu