ఆ ముగ్గురిలో అవకాశం ఎవరికి దక్కుతుందో!

బాహుబలి సినిమా తరువాత అంతటి క్రేజ్ ఉన్న సినిమా ‘రోబో2’. దాదాపు 250 కోట్ల బడ్జెట్ తో రూపొందుతోన్న ఈ సినిమాలో రజినీకాంత్ తో  పాటు అక్షయ్ కుమార్ వంటి బాలీవుడ్ స్టార్ హీరో నటిస్తున్నాడు. తమిళం, హిందీలతో పాటు తెలుగులో కూడా ఈ సినిమా మార్కెట్ భారీ  స్థాయిలోచేయాలని నిర్ణయించుకున్న శంకర్ ఈ సినిమాలో టాలీవుడ్ కు చెందిన ఓ స్టార్ హీరోను గెస్ట్ రోల్ లోనటింపజేయాలని డిసైడ్ అయ్యాడు.  అప్పటి నుండి ఆ హీరో ఎవరనే విషయంపై ఆసక్తి పెరిగింది. ఆ అవకాశం ఎన్టీఆర్, అల్లు అర్జున్, ప్రభాస్ ఈ ముగ్గురి హీరోల్లో ఒకరికి దక్కబోతోందని  సమాచారం.
 
ఈ ముగ్గురు హీరోలకు తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉంది. కాబట్టి వీరి గెస్ట్ రోల్ సినిమాకు ఖచ్చితంగా ప్లస్ అవుతుంది. దీనికోసం హీరోల రెండు, మూడు రోజుల కాల్షీట్స్ సరిపోతుంది. శంకర్ అడిగితే ఏ హీరో అయినా.. ఒప్పుకుంటాడనే నమ్మకాన్ని వ్యక్తం చేస్తోంది చిత్రబృందం. మరి ఈ  ముగ్గురు హీరోల్లో రజినీకాంత్ తో కలిసి నటించే అవకాశం ఎవరికి దక్కుతుందో.. చూడాలి. ఇప్పటికే ఈ సినిమా తెలుగు రైట్స్ కోసం నిర్మాతలు  క్యూ కడుతున్నారు. తెలుగులో హీరోని కన్ఫర్మ్ చేసి.. దానికి తగ్గ రేట్ కూడా ఫిక్స్ చేస్తారనే మాటలువినిపిస్తున్నాయి!