HomeTelugu Trendingమహేష్‌తో నటించాలి అని ఉంది: రోజా

మహేష్‌తో నటించాలి అని ఉంది: రోజా

Roja wants to act with mah

టాలీవుడ్‌ సీనియర్‌ నటి, జబర్దస్త్ జడ్జ్‌ రోజా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఓ వైపు ఎమ్మెల్యేగా.. మరోవైపు టీవీ కార్యక్రమాలతో రోజా బిజీగా కనిపిస్తుంటారు. తీరిక లేదు కాబట్టి ఇటీవల సినిమాల్లో నటించడం లేదు. గతంలో 100కు పైగా సినిమాల్లో నటించి రోజా ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే తనకు ప్రస్తుతం ఉన్న హీరోల్లో మహేష్‌బాబు అంటే ఎంతో ఇష్టమని రోజా వెల్లడించారు. ఈ విషయాన్ని జబర్దస్త్‌లోని ఓ స్కిట్ ద్వారా ఆమె బయటపెట్టారు.

జబర్దస్త్ హోమ్ టూర్‌లో భాగంగా హైపర్ ఆది టీమ్ నగరిలోని ఎమ్మెల్యే రోజా నివాసానికి వెళ్లారు. అక్కడ హాలులో వేంకటేశ్వర స్వామి ఫొటో ఉండటంతో హైపర్ ఆది.. ఆయన్ని ఏం కోరుకుంటారమ్మా అని ఆది అడిగితే.. కృష్ణ గారి అబ్బాయి మహేష్ బాబుతో సినిమా చేయాలని ఉందంటూ రోజా ఆ దేవుడిని వేడుకున్నారు. అయితే ఇదంతా స్కిట్‌లో భాగమని తెలుస్తోంది. అనంతరం రోజా కిచెన్ లోకి వెళ్లి టీ పెట్టి హైపర్ ఆది టీమ్ సభ్యులకు ఇచ్చారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu