మెగాస్టార్‌ చేతుల మీదుగా ‘దేశంలో దొంగలు పడ్డారు’ ట్రైలర్‌

టాలీవుడ్‌ ప్రముఖ హాస్యనటుడు ఆలీ తమ్ముడు ఖయూమ్‌ హీరోగా వస్తోన్న తాజా చిత్రం ‘దేశంలో దొంగలు పడ్డారు’. కమెడియన్‌గా తన అదృష్టాన్ని పరీక్షించుకున్న ఖయూమ్‌ తాజాగా హీరోగా మారి చేస్తోన్న ఈ చిత్రాన్ని భారీ ఎత్తున రిలీజ్‌ చేయించేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. ఈ చిత్ర ట్రైలర్‌ను మెగాస్టార్‌ చిరంజీవి చేతుల మీదుగా రిలీజ్‌ చేయించారు.

ఈ మూవీ ట్రైలర్‌ను విడుదల చేసిన అనంతరం చిరంజీవి మాట్లాడుతూ.. ‘దేశంలో దొంగలు పడ్డారు’ ట్రైలర్ నా చేతుల మీదుగా ఆవిష్కరించడం సంతోషం. దీనికి కారణం నా చిరకాల మిత్రుడు అలీ సోదరుడు ఖయ్యూం ఇందులో ప్రధాన పాత్ర పోషించడం చూసి నాకు ఓ మంచి అభిప్రాయం వచ్చింది. డైరెక్టర్ గౌతమ్ ఫస్ట్‌టైమ్ డైరెక్ట్ చేస్తున్నప్పటికీ ట్రైలర్ చూసిన తర్వాత మాత్రం ఓ సీనియర్ మోస్ట్ డైరెక్టర్ హ్యాండిల్ చేస్తున్నట్లుగా అనిపించింది. ఈ మూవీ ట్రైలర్ ఇంప్రెస్సీవ్ గా ఉంది. ముందుగా అలీ నాదగ్గరికి వచ్చి ఖయ్యూం నటించిన సినిమా అనగానే ఇదొక కామెడీ సినిమా అనుకున్నాను, కానీ ఇది ఒక సీరియస్ సినిమా అని ట్రైలర్ చూసాక అర్థం అయ్యింది. ఇది ఖయ్యూంకు ఖచ్చితంగా ఒక టర్నింగ్ పాయింట్ అవుతుంది. తన కెరియర్‌కు ఇది బెస్ట్ సినిమాగా నిలుస్తుంది. అలాగే కొత్త అమ్మాయి తనిష్క కూడా పెరఫార్మర్స్‌కు స్కోప్ ఉన్న పాత్రలో నటించిందని అర్థం అవుతుంది.. ఈ సందర్భంగా యూనిట్‌కు సంబంధించిన టెక్నీషియన్ సభ్యులందరికీ, అలాగే మా ఖయ్యూం కి ఆల్ ది వెరీ బెస్ట్, గౌతమ్‌ని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను’ అని అన్నారు.