HomeTelugu Trendingనాగశౌర్య మూవీ నుంచి రొమాంటిక్ సాంగ్

నాగశౌర్య మూవీ నుంచి రొమాంటిక్ సాంగ్

10 13

యువ కథానాయకుడు నాగశౌర్య విశాఖలోని విజ్ఞాన్‌, గీతమ్‌ కాలేజీల్లో సందడి చేశారు. నాగశౌర్య హీరోగా నటిస్తున్న చిత్రం ‘అశ్వథ్థామ’ చిత్రానికి సంబంధించిన ‘నిన్నే.. నిన్నే.. ఎదలో నిన్నే..’ అంటూ సాగే లిరికల్‌ వీడియోను విశాఖపట్నంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా నాగశౌర్య దువ్వాడ విజ్ఞాన్‌ కాలేజీ‌, రుషి కొండలోని గీతమ్‌ కాలేజీలకు వెళ్లారు. అక్కడి విద్యార్థులతో కలిసి సందడి చేశారు. ‘అశ్వథ్థామ’ చిత్రం గురించి విశేషాలను వారితో పంచుకున్నారు. నాగశౌర్యతో కరచాలనం చేసేందుకు, ఫొటోలు దిగేందుకు విద్యార్థులు పోటీపడ్డారు. జనవరి 31న ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటుంది. రమణ తేజ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మెహరీన్‌ కథానాయిక.

Recent Articles English

Gallery

Recent Articles Telugu