HomeTelugu Trending'ఆర్‌ఆర్‌ఆర్‌' ఫస్ట్‌ డే కలెక్షన్‌

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ఫస్ట్‌ డే కలెక్షన్‌

RRR 1st day collects rs 250

టాలీవుడ్ స్టార్‌ హీరోలు ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ మల్టీస్టారర్లుగా తెరకెక్కిన చిత్రం ఆర్‌ఆర్‌ఆర్‌. నాలుగేళ్ల నిరీక్షణ తర్వాత శుక్రవారం(మార్చి25)న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిందీ చిత్రం. రాజమౌళి డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్స్ ఆలియా భ‌ట్‌, అజ‌య్ దేవ‌గ‌ణ్‌ల‌తో పాటు హాలీవుడ్ స్టార్స్ ఒలివియా మోరిస్‌, అలిస‌న్ డూడి, రే స్టీవెన్ స‌న్ త‌దిత‌రులు న‌టించారు. డీవీవీ దానయ్య భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ కొమురం భీమ్‌గా, రామ్‌చరణ్‌ అల్లూరి సీతారామరాజుగా కనిపించారు. విడుదలకు ముందే రికార్డులు బద్దలు కొట్టిన ఈ చిత్రం తొలిరోజు కలెక్షన్లలో సునామి సృష్టించింది.

ట్రేడ్ వ‌ర్గాల స‌మాచారం మేర‌కు ఒక్క నైజాం ఏరియాలోనే క‌లెక్ష‌న్స్ ప‌రంగా స‌రికొత్త రికార్డును క్రియేట్ చేసింది. నైజాం ఏరియాలో తొలి రోజున రూ.23.35 కోట్లు వసూలు చేసింది. తొలిరోజున తెలుగు రాష్ట్రాల్లో సుమారు 120.19కోట్ల వసూళ్లు రాబట్టినట్లు సమాచారం. అలాగేఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లో కూడా ఈ సినిమా భారీ వసూళ్లను సాధిస్తోంది. ఓవర్సీస్‌ కలుపుకొని ప్రపంచ వ్యాప్తంగా తొలిరోజు రూ. 257.15 కోట్లు వసూలు చేసి తెలుగు సినిమా పవర్‌ మరోసారి చూపించింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu