ప్రముఖ దర్శకుడు శంకర్ రెండో కూతురి రెండో పెళ్లికి సర్వం సిద్దమైంది. శంకర్ చిన్న కూతురు ఇప్పుడు రెండో పెళ్లికి సిద్దమైంది. ఐశ్వర్యా శంకర్ మొదటి భర్తతో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ఆ మొదటి భర్త మీద పోక్సో చట్టం కింద కేసు కూడా నమోదైన విషయం విధితమే. అయితే ఇప్పుడు ఐశ్వర్య మళ్లీ ప్రేమలో పడినట్టుగా తెలుస్తోంది. శంకర్ వద్ద అసిస్టెంట్‌గా పని చేస్తున్న తరుణ్ కార్తికేయన్‌తో ఐశ్వర్య ప్రేమలో పడింది.
తరుణ్ ఐశ్వర్యల నిశ్చితార్థం ఆదివారం జరిగినట్టుగా కనిపిస్తోంది. ఈ మేరకు అదితీ శంకర్ తన ఇన్ స్టాలో ఈ ఇద్దరి ఫోటోలను షేర్ చేసింది. ఈ ఇద్దరికీ ఎంగేజ్మెంట్ జరిగినట్టుగా ప్రకటించింది. అయితే తరుణ్ ఐశ్వర్యల పెళ్లికి సంబంధించిన డేట్‌ను మాత్రం ఇంకా ప్రకటించలేదు. మొత్తానికి అసిస్టెంట్ డైరెక్టర్‌గా వచ్చిన అల్లుడు స్థానాన్ని సంపాదించేసుకున్నాడంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.
శంకర్ ప్రస్తుతం గేమ్ చేంజర్ పనుల్లో ఉన్నాడు. ఈ మూవీని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ప్రయత్నిస్తున్నాడు. మరో వైపు ఇండియన్ 2 మూవీని కంప్లీట్ చేశాడు శంకర్. ఈ ఏడాది తన సినిమాలను విడుదల చేస్తాడా? లేదా? అన్న అనుమానం అయితే సినీ అభిమానుల్లో ఉంది.