HomeTelugu Big Stories'ఆర్‌ఆర్‌ఆర్' మూవీ 3వ రోజు కలెక్షన్స్‌ ఎంతంటే!

‘ఆర్‌ఆర్‌ఆర్’ మూవీ 3వ రోజు కలెక్షన్స్‌ ఎంతంటే!

RRR movie day 3 box office

‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమా విడుదలై హిట్‌ టాక్‌తో దూసుకుపోతుంది. రాజమౌళి, తారక్‌, రామ్‌చరణ్‌ల కష్టం వృధా కాదని, ఈ సినిమా రికార్డులు తిరగరాయడం గ్యారెంటీ అని కామెంట్లు చేస్తున్నారు ట్రేడ్‌ పండితులు. అన్నట్లుగానే మార్చి 25న పాన్‌ ఇండియా మూవీగా విడుదలైన ఆర్‌ఆర్‌ఆర్‌ బాక్సాఫీస్‌పై కనక వర్షం కురిపిస్తోంది. మొదటి రోజు రూ.223 కోట్లకు పైగా రాబట్టిన ఈ చిత్రం తాజాగా రూ.500 కోట్ల మైలురాయిని అధిగమించింది.

మరోపక్క హిందీలో తొలిరోజు పెద్ద దూకుడు చూపించని ఈ చిత్రం వీకెండ్‌లో మాత్రం బాగా పుంజుకుంది. శుక్రవారం రూ.19 కోట్లు, శనివారం రూ.24 కోట్లు రాబట్టగా ఒక్క ఆదివారం నాడే రూ.31.50 కోట్ల మేర వసూలు చేసింది. అంటే ఒక్క హిందీలోనే ఇప్పటివరకు రూ.74.50 కోట్లు సాధించింది.

ఇక సినిమా విషయానికి వస్తే ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రంలో జూనియర్‌ ఎన్టీఆర్‌ కొమురం భీమ్‌గా, రామ్‌ చరణ్‌ అల్లూరి సీతారామరాజుగా నటించారు. ఆలియా భట్‌, ఒలీవియా మోరిస్‌ హీరోయిన్లుగా నటించారు. ఎస్‌ఎస్‌ రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య రూ.400- 450 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించారు.

‘ఆర్‌ఆర్‌ఆర్’ మూవీ రివ్యూ

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!