HomeTelugu Trendingఓటీటీలో 'ఆర్‌ఆర్‌ఆర్‌'.. వచ్చేస్తుంది

ఓటీటీలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’.. వచ్చేస్తుంది

rrr
టాలీవుడ్‌ స్టార్‌ హీరోలు ఎన్టీఆర్, రాంచరణ్ ఫ్యాన్స్‌కి గుడ్‌ న్యూస్‌. దర్శక ధీరుడు రాజమౌళి, ఎన్టీఆర్, రాంచరణ్ కాంబినేషన్‌లో వచ్చిన బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ఆర్ఆర్ఆర్’ ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.. అయితే త్వరలోనే ఈ సినిమా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో అడుగుపెట్టబోతోంది. ఈ సినిమా ఓటీటీ హక్కులను సొంతం చేసుకున్న జీ5.. ట్రిపులార్ డిజిటల్ ప్రీమియర్ డేను ప్రకటించింది.

ఈ నెల 20న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఆర్ఆర్ఆర్ వచ్చేస్తున్నట్టు తెలిపింది. అదే రోజున ఎన్టీఆర్ బర్త్ డే కావడంతో అభిమానుల సంతోషానికి హద్దే లేకుండా పోయింది. మార్చిలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా బాక్సాఫీసు రికార్డులను బద్దలుగొట్టింది. ఏకంగా రూ. 1000 కోట్ల వసూళ్లు రాబట్టింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu