ఆర్‌ఆర్‌ఆర్‌ నుండి కీలక అప్డేట్

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్, మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్ లు హీరోలుగా నటిస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతున్నది. సినిమాకు సంబధించిన వర్కింగ్ టైటిల్ ఫోటో తప్పించి ఇప్పటి వరకు ఎలాంటి పోస్టర్ విడుదల కాలేదు. వినాయక చవితికి వస్తుదేనేమో అనుకున్నారు.. రాలేదు.. దసరా వరకు వెయిట్ చేశారు.. ఊహు.. పోనీలే దీపావళికి వస్తుందేమో అనుకున్నా అపుడు కూడా నిరాశనే కలిగించింది.

సినిమా పబ్లిసిటీ విషయంలో వినూత్నంగా ఆలోచించే రాజమౌళి, ఈ సినిమా విషయంలో మరింత కేర్ తీసుకుంటున్నారు. ప్రస్తుతం రామ్ చరణ్ కు సంబంధించిన కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన మూడు పోస్టర్స్ ను రాజమౌళి సిద్ధం చేయించినట్టు సమాచారం. ఎన్టీఆర్, రామ్ చరణ్ పోస్టర్లు కాగా, ఇద్దరు కలిసున్న పోస్టర్ మరొకటి. ఈ మూడు పోస్టర్స్ ను రాజమౌళి త్వరలోనే రిలీజ్ చేయబోతున్నారట. ఈ న్యూస్ లో ఎంతవరకు నిజం ఉన్నదో తెలియదుగాని, ఫ్యాన్స్ మాత్రం తెగ సంబర పడిపోతున్నారు.