HomeTelugu Big Storiesఅజయ్‌ దేవ్‌గన్‌కు ఎన్టీఆర్‌ ఘనస్వాగతం.. ఫొటో వైరల్‌

అజయ్‌ దేవ్‌గన్‌కు ఎన్టీఆర్‌ ఘనస్వాగతం.. ఫొటో వైరల్‌

12 12
యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ నటిస్తున్న మల్టీస్టారర్‌ ‘RRR’ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతుంది. ఈ చిత్ర సెట్‌లోకి అజయ్ దేవ్‌గన్ వచ్చి కూడా మూడు నాలుగు రోజులు అవుతుంది. అయితే ఇప్పటి వరకు హీరోలతో మాత్రం ఈయన కాంబినేషన్ సెట్ కాలేదు. అయితే తొలిరోజు అజయ్ దేవ్‌గన్‌ రామ్ చరణ్‌తో కలిసి పని చేసాడు. దాంతో సినిమా యూనిట్ అంతా కలిసి ఆయనకు ఘనస్వాగతం పలికారు. ముఖ్యంగా రామ్ చరణ్, అజయ్ మధ్య వచ్చే సన్నివేశాలు అదిరిపోతాయని.. ఈ చిత్రంలో చరణ్ తండ్రిగా అజయ్ దేవ్‌గన్ నటిస్తున్నాడని ప్రచారం జరుగుతుంది.

అల్లూరి సీతారామరాజు పాత్రకు స్వాతంత్ర్య కాంక్ష్య రగిలించేలా అజయ్ దేవ్‌గన్ పాత్ర ఉంటుందని తెలుస్తుంది. ప్రస్తుతానికి చరణ్ చిన్నప్పటి సన్నివేశాలు చిత్రీకరిస్తున్నాడు డైరెక్టర్‌ రాజమౌళి. ఇందులో భాగంగానే చరణ్, ఎన్టీఆర్ కూడా సెట్‌కు వచ్చారు. అక్కడే రాజమౌళి ఉండటంతో అజయ్, చరణ్, రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్ కలిసి ఫోటోకు పోజులిచ్చారు. మా సినిమాలోకి ఘనస్వాగతం అజయ్ గారూ అంటూ ట్వీట్ చేసాడు మన యంగ్‌ టైగర్‌. ఈ ఫోటో చూసిన అభిమానులు రెండు కళ్లు సరిపోవడం లేదంటున్నారు.

ఇక షూటింగ్ అయితే అనుకున్న దానికంటే వేగంగానే పూర్తి జరుగుతుంది. అయితే జులై 30న రీలీజ్‌ అవుతుందా.. లేదా అనేది మాత్రం తెలియదు. దీనికి సమాధానం తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. ఈ చిత్రంలో అజయ్ ఇండో బ్రిటీష్ పోలీస్ పాత్రలో నటిస్తున్నాడని ప్రచారం జరుగుతుంది. 300 కోట్లతో దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అలియా భట్, ఒలివియా మోరీస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. తాజాగా ఈ చిత్రంలో శ్రియ అజయ్‌ దేవ్‌గన్‌ భార్య పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu