HomeTelugu Trendingథియేటర్‌ల్లో 'ఆర్‌ఆర్‌ఆర్‌' ట్రైలర్‌.. ఫ్యాన్స్‌ ఫిదా

థియేటర్‌ల్లో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ట్రైలర్‌.. ఫ్యాన్స్‌ ఫిదా

RRR movie trailer release i

టాలీవుడ్ స్టార్‌ హీరోలు రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌ నటించిన భారీ మల్టీస్టారర్‌ మూవీ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. దర్శక దిగ్గజం రాజమౌళి డైరెక్షన్‌లో పాన్‌ ఇండియా చిత్రంగా రూపు దిద్దుకుంటున్న మోస్ట్‌ ఎవైటెడ్‌ మూవీ ఆర్‌ఆర్‌ఆర్‌. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే ఫస్ట్‌లుక్‌ సాంగ్స్‌, మేకింగ్‌ వీడియోలు ఫ్యాన్స్‌కు మంచి స్పందన వచ్చింది. ఈ రోజు థియేటర్లలో రిలీజైన ట్రైలర్‌ మరింత హంగామా సృష్టిస్తోంది. ఆర్‌ఆర్‌ఆర్‌ (రౌద్రం, రణం, రుధిరం) ట్రైలర్‌తో జక్కన్న సర్‌ప్రైజ్‌కి ఫ్యాన్స్‌ ఫిదా అయిపోతున్నారు. గూస్‌ బంప్స్‌ అంతే తెగ సంబర పడిపోతున్నారు.

తాజాగా సమాచారం ప్రకారం ఈ సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ లభించింది. దాదాపు మూడు గంటల ఆరు నిమిషాల 54 సెకన్ల నిడివితో ఆర్ఆర్ఆర్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 7న థియేటర్లలో విడుదల కాబోతుంది. దాదాపు రూ. 400 కోట్లతో ఈ మూవీ తెరకెక్కిన సంగతి తెలిసిందే.

Recent Articles English

Gallery

Recent Articles Telugu