HomeTelugu NewsRTA లో అవినీతి అనకొండలకు సీతయ్య స్వీట్ వార్నింగ్...

RTA లో అవినీతి అనకొండలకు సీతయ్య స్వీట్ వార్నింగ్…

బదిలీల కోసం లంచాలంటూ ఉద్యోగులను వేధిస్తే తాటా తీస్తానంటూ ఆంధ్రప్రదేశ్ RTA కమీషనర్ PSR ఆంజనేయులు రవాణా శాఖ లోని అవినీతిపరులకు ఇచ్చిన వార్నింగ్ వీడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది. గత ప్రభుత్వం హయాం లో RTA శాఖ లో జరిగిన అవినీతి పర్వాలపై ఇప్పటి కే కొరడ ఝళిపిస్తోన్న ఈ IPS అధికారి తాజా వీడియో, రవాణా శాఖ లో పాతుకుపోయిన అవినీతి అనకొండల కు దడపుట్టిస్తోంది.

2015 నుండి బదిలీలు కాకుండా లంచాలిచ్చి అప్పటి రవాణాశాఖ కమీషనర్ ఫ్రీ హ్యాండ్ తో ఆమ్యామ్యాలకు ఇష్ఠ్యా రాజ్యంగా మారిన RTA డిపార్ట్‌మెంట్ లో ఇప్పటి కే అవినీతి అధికారుల దుమ్ముదులుపుతున్న రవాణా శాఖ కమీషనర్ తాజా వీడియో సమావేశాల్లో డిప్యూటీ ఆర్టీఏ అధికారులకు, మోటర్ వెహికల్ ఇన్ స్పెక్టర్లుకు తనదైన శైలిలో వార్నింగ్ ఇచ్చారు..

RTA

ఏపిలో కొత్తగా ఏర్పడ్డ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అవినీతి, పారదర్శకత లో భాగంగా కఠినంగా వుండాలని సీఎం జగన్ స్పష్టంగా చెప్పారు. ఈ విషయం లో ఎలాంటి అవినీతి అధికారులను ఉపేక్షించవద్దని ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడంతో సీఎం ఆదేశాలను అమలు చేస్తూన్నారు రవాణా శాఖ ఉన్నతాధికారులు.

శాఖలోని అధికారులు బదిలీలకోసం ఉద్యోగుల నుండి లంచాలు వసూలు చేస్తున్నారనే సమాచారం ఆయనకు రావడంతో బదిలీల్లో అక్రమాలకు పాల్పడుతున్న అనకొండలతో ప్రత్యేక మీటింగ్ ఏర్పాటు చేసిన ఆయన మోటర్ వెహికల్ ఇన్ స్పెక్టర్ ల నుండి డిప్యూటీ కమీషనర్ రేంజ్ స్థాయి అధికారులకు సీరియస్ వార్నింగ్ ఇచ్చిన వీడియో ఇప్పుడు సామాజిక‌మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. లంచాలు, రికెమెండెషన్ లు లేని వారికే మొదటి ప్రియారిటీ అన్న కోటాలో తాజా బదిలీలు రవాణ శాఖలో తొలిసారిగా జరిగాయని RTA ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. ఆ శాఖ కమీషనర్ గా బాధ్యతలు తీసుకున్న నాటినుండి ప్రైవేటు ట్రావెల్స్ ఆగడాలపై కఠిన చర్యలు, వాటితో పాటు దొంగ ఇన్ వాయిస్లతో లైఫ్ టాక్స్ ఎగ్గొట్టిన డీలర్ల పై ఇప్పటికే సీరియస్ యాక్షన్ తీసుకున్నారు కమీషనర్ PSR ఆంజనేయులు. తాజా గా జరిగిన బదిలీల ప్రక్రియ లో ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తూ పారదర్శకంగా, కఠినంగా చేపట్టడంతో దాదాపు 300 మందికి పైగా ఉద్యోగులలో బదిలీలు నయాపైసా ఖర్చుకాకుండా జరిగాయని రవాణా శాఖ ఉద్యోగులు చర్చించుకుంటున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu