HomeTelugu Newsఆ ప్రచారం నాకు బాధ కలిగించింది.. ఇక శేష జీవితం అక్కడే: గవర్నర్‌

ఆ ప్రచారం నాకు బాధ కలిగించింది.. ఇక శేష జీవితం అక్కడే: గవర్నర్‌

9ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఆ తర్వాత తెలుగు రాష్ట్రాలకు గవర్నర్‌గా పనిచేసి మంచి జ్ఞాపకాలను తీసుకువెళ్తున్నట్టు నరసింహన్ అన్నారు.. ఛత్తీస్‌గఢ్‌ నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా వచ్చినప్పుడు హైదరబాద్‌లో కర్ఫ్యూ ఉందన్నారు నరసింహన్. ఆ తర్వాత అన్ని రాజకీయ పార్టీలు, సంఘాలు రాష్ట్రంలో శాంతికి సహకరించాయన్నారు. ఉద్యమ సమయంలో పోలీసులు ఒక్క తూట పేల్చలేదని… ఆ సమయంలో వారు బాగా పనిచేసారని కితాబిచ్చారు నరసింహన్. ఆ తర్వాత రాష్ట్ర విభజన జరిగి… రెండు తెలుగు రాష్ట్రాలు ఏర్పడ్డాయని అన్నారు గవర్నర్. రెండు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి సంపూర్ణ సహకారం అందిందన్నారు.

గవర్నర్‌గా పలు ఆసక్తికర అంశాలను చెప్పారు నరసింహన్. గుళ్ల చుట్టూ తిరుగుతున్నారన్న ప్రచారం తనకు కొంత బాధ కలిగించిందని అన్నారు. తాను ఆలయాలన్నీ తిరగలేదన్నారాయన. ఉమ్మడి ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ ప్రసంగంలో జరిగిన సంఘటనలను ముందే ఊహించాను అన్నారు నరసింహన్. ఎక్సట్రా బడ్జెట్ కాపీ, మైక్, పూర్తి బడ్జెట్ ప్రసంగం పూర్తి చేసి తర్వాతే బయటకు రావాలని డిసైడ్ అయి వెళ్లానన్నారు. తనతో రాజ్ భవన్ లో హోళీ అడిన తర్వాత కొంత మంది రాజకీయ నాయకులు బయటకు వెళ్లి… గవర్నర్ గో బ్యాక్ అంటామని… ఏం అనుకోవద్దని తనను కోరారని చెప్పారు నరసింహన్. తనకు ఎటువంటి ఎజెండా లేదని… అంతరాత్మ ప్రభోదానుసారం, రాజ్యాంగానికి లోబడి పనిచేసానని చెప్పారు గవర్నర్. ఇక, తాను చెన్నైలో శేషజీవితాన్ని సాధారణ వ్యక్తిగా గడుపుతానని చెప్పారు నరసింహన్. గవర్నర్ పదవికంటే ముందే ఎలా జీవితం గడిపానో అటువంటి జీవినాన్ని కొనసాగిస్తానని అన్నారు. గవర్నర్ గా ప్రయాణంలో ఎన్నో నేర్చుకున్నానని అన్నారు. తాను సక్సెస్ అయ్యానా… ఫెయిల్ అయ్యానా అన్నది చరిత్ర నిర్ణయిస్తుందన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu