HomeTelugu Trendingబాలయ్య రూలర్‌ ఫస్ట్‌సాంగ్‌ విడుదల

బాలయ్య రూలర్‌ ఫస్ట్‌సాంగ్‌ విడుదల

1టాలీవుడ్‌ స్టార్‌ హీరో నందమూరి బాలకృష్ణ నటించిన చిత్రం ‘రూలర్‌’. ఈ చిత్రానికి కె.ఎస్‌.రవికుమార్‌ దర్శకత్వం వహించారు. ఈ సినిమా నుంచి ఫస్ట్‌ సాంగ్‌ను చిత్రబృందం సోషల్‌మీడియా వేదికగా ఆదివారం విడుదల చేసింది. ‘అడుగడుగో యాక్షన్‌ హీరో.. అరే దేఖో యారో..’ అంటూ ఈ సాగే పాట లిరికల్‌ వీడియోను అభిమానులతో పంచుకుంది. ‘చూపుల్లోనా వీడు క్లాసు.. మనసే బిసీ సెంటర్‌ మాసు.. పక్కా వైట్‌ కాలరు.. కార్పొరేట్‌ లీడరు..’ అని బాలయ్యను ఉద్దేశిస్తూ రాసిన సాహిత్యం నందమూరి అభిమానులను ఎంతగానో ఆకర్షిస్తుంది.

‘రూలర్‌’ సినిమాలో బాలయ్య ధర్మ అనే పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. సోనాల్‌ చౌహాన్‌, వేదిక హీరోయిన్‌లు. భూమిక, ప్రకాశ్‌రాజ్‌ ఈ సినిమాలో కీలకపాత్రలు పోషించారు. చిరంతన్‌ భట్‌ సంగీతం అందించారు. సి.కల్యాణ్‌ నిర్మాతగా వ్యవహించారు.

ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్‌ సినీ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. చిత్రీకరణ పూర్తయిన ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణాంతర పనులు జరుపుకొంటోంది. డిసెంబర్‌ 20వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu