HomeTelugu Big Storiesపెళ్లి పీటలెక్కనున్న ప్రభాస్‌ డైరెక్టర్‌!

పెళ్లి పీటలెక్కనున్న ప్రభాస్‌ డైరెక్టర్‌!

5aటాలీవుడ్‌లో వరుసగా పెళ్లి బాజాలు మోగుతున్నాయి. నిర్మాత దిల్ రాజు, హీరో నిఖిల్ ఒక ఇంటివాడు అయ్యారు. హీరోలు నితిన్, రానాల త్వరలోనే పెళ్లి పిటలు ఎక్కబోతున్నారు. తాజాగా మరో సినీ ప్రముఖుడు పెళ్లిపీటలు ఎక్కబోతున్నాడు. ‘రన్ రాజా రన్‌’తో టాలీవుడ్‌కి పరిచయమైన డైరెక్టర్ సుజీత్.. ఆ తర్వాత ప్రభాస్‌తో పాన్ ఇండియా మూవీ ‘సాహో’ రూపొందించి ఫేమస్ అయ్యారు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి నటించబోయే ‘లూసిఫర్’ రీమేక్ స్క్రిప్ట్ డెవలప్ చేసే పనిలో ఉన్నారు. అతిత్వరలో ఈ సినిమా సెట్స్ మీదకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు.

గత కొంతకాలంగా ప్రవల్లిక అనే అమ్మాయితో ప్రేమలో ఉన్న ఆయన.. ఆమె మెడలో మూడు ముళ్ళేసేందుకు రెడీ అయ్యారు. ఈ క్రమంలోనే జూన్ 10వ తేదీన సుజీత్ నిశ్చితార్థం చేసుకుకోనున్నట్లు తెలిసింది. కుటుంబ సభ్యులు, పెద్దల సమక్షంలో సుజీత్ ఎంగేజ్‌మెంట్ జరగనుందట. ఇందుకోసం ఏర్పాట్లు జరుగుతున్నాయట. సుజీత్ చేసుకోబోయే అమ్మాయి ప్రవల్లిక వృత్తిరీత్యా డాక్టర్ అని సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu