HomeTelugu Big Storiesసచిన్‌ గురువు రమాకాంత్ అచ్రేకర్ మృతి

సచిన్‌ గురువు రమాకాంత్ అచ్రేకర్ మృతి

10 1ద్రోణాచార్య పురస్కార గ్రహీత, ప్రముఖ క్రికెట్‌ కోచ్‌ రమాకాంత్‌ అచ్రేకర్‌‌ ముంబయిలో మృతి చెందారు. క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండుల్కర్‌కు ఆటలో ఓనమాలు దిద్దించిన ఆయన వృద్ధాప్య సమస్యలతో కన్నుమూశారు. వినోద్‌ కాంబ్లి, ప్రవీన్‌ ఆమ్రె, సమీర్‌ దిఘె, బల్విందర్‌ సింగ్‌ సంధు, అజిత్‌ అగార్కర్‌ వంటి క్రికెటర్లకు అచ్రేకర్ శిక్షణ నిచ్చారు. ప్రపంచానికి తిరుగులేని క్రికెటర్‌ సచిన్‌ను తీర్చిదిద్దిన ఘనత అచ్రేకర్‌కే చెందుతుంది. ముంబయిలోని శివాజీ పార్క్‌ వద్ద కామత్‌ స్మారక క్రికెట్‌ క్లబ్‌ను అచ్రేకర్‌ ప్రారంభించారు. ఎంతో మంది క్రికెటర్లకు ఆయన పాఠాలు చెప్పారు. పద్మశ్రీ పురస్కారం గ్రహీత అచ్రేకర్‌కు సచిన్‌ టెండుల్కర్‌ ప్రియశిష్యుడు. 1932లో అచ్రేకర్‌ జన్మించారు. క్రికెట్‌ కెరీర్‌ అంత సవ్యంగా సాగలేదు.1943లో క్రికెట్‌ ఆడటం ప్రారంభించారు.1945లో న్యూ హిందు స్పోర్ట్స్‌ క్లబ్‌ తరఫున ఆడారు. యంగ్‌ మహారాష్ట్ర ఎలెవన్‌, గుల్‌ మోహర్‌ మిల్స్‌, ముంబయి పోర్ట్‌కు ప్రాతినిథ్యం వహించారు. 1963-64 మొయిన్‌ద్దౌలా టోర్నీలో ఆల్‌ ఇండియా స్టేట్‌ బ్యాంకు జట్టు తరఫున హైదరాబాద్‌పై ఒక ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌ ఆడారు. ప్రతి గురుపౌర్ణమికి ఆయన అచ్రేకర్‌ సర్‌ ఇంటికి వెళ్తారు. గురువు ఆశ్వీర్వాదం తీసుకొని శాలువా కప్పి సత్కరించే సంగతి తెలిసిందే.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!