HomeTelugu Trendingరానా నాకు గొడుగు పట్టారు.. సాయి పల్లవి కామెంట్స్‌

రానా నాకు గొడుగు పట్టారు.. సాయి పల్లవి కామెంట్స్‌

Sai Pallavi comments on Ran
టాలీవుడ్‌ యంగ్‌ హీరో రానా నటించిన చిత్రం ‘విరాట పర్వం’. సురేశ్ బాబు – చెరుకూరి సుధాకర్ కలిసి నిర్మించిన ఈ సినిమాకి, వేణు ఉడుగుల దర్శకత్వం వహించాడు. 1990లలోని నక్సలిజం నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. ఈ నెల 17వ తేదీన ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ ఊపందుకున్నాయి.

ఈ సినిమా ప్రెస్ మీట్ లో సాయిపల్లవి మాట్లాడుతూ .. “దర్శకుడు వేణు గారు ఈ కథను రాసుకున్నప్పుడు .. నేను ఈ పాత్రను చేస్తున్నట్టుగా కల వచ్చిందట. దాంతో ముందుగా నన్నే సంప్రదించారు. నా పాత్రను నేను ఎంతగా ప్రేమించి చేశాననేది సినిమా చూసిన తరువాత మీరే చెప్పాలి. నా పాత్ర ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుందని నేను భావిస్తున్నాను. ఇక రానా గారు కాదంటే ఈ సినిమానే లేదు. అన్నీ తానై ఆయన నడిపించారు. రానా తెరపై ఎలా ఉంటారో .. బయట కూడా అలాగే ఉంటారు. పెద్ద మనసున్నవారి ప్రవర్తన ఎప్పుడూ అలాగే ఉంటుంది. నిన్న వర్షంలో స్టేజ్ పై రానా నాకు గొడుగు పట్టారు .. అది ఆయన గొప్పతనం. నిజం చెప్పాలంటే ఆ మంచితనమే ఆయన ఒరిజినల్ కేరక్టర్” అంటూ చెప్పుకొచ్చింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!