HomeTelugu Trendingపవన్‌ సినిమాకి నో చెప్పిన సాయి పల్లవి!

పవన్‌ సినిమాకి నో చెప్పిన సాయి పల్లవి!

Sai pallavi rejects pawan k

పవర్‌స్టార్ ప‌వ‌న్ కళ్యాణ్ రీ ఎంట్రీ తరువాత వరుస సినిమాలతో బీజీగా ఉన్నాడు. ఇప్ప‌టికే వ‌కీల్ సాబ్ షూటింగ్‌ని పూర్తి చేసుకున్న ప‌వ‌న్.. ప్ర‌స్తుతం క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ మూవీలో.. అయ్య‌ప్ప‌నుమ్ కోషియుమ్ రీమేక్‌లో మ‌రో చిత్రంలో న‌టిస్తున్నారు. మ‌ల‌యాళంలో మంచి విజ‌యం సాధించిన అయ్య‌ప్ప‌నుమ్ కోషియుమ్‌కి సాగ‌ర్ చంద్ర ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఇందులో పవ‌న్‌తో పాటు రానా కూడా నటిస్తున్నారు. కాగా ఈ సినిమాలో హీరోయిన్‌గా సాయి ప‌ల్ల‌విని ఫైన‌ల్ చేసిన‌ట్లు వార్త‌లు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఈ మూవీకి సంబంధించి సాయి ప‌ల్ల‌వి డేట్లు కూడా ఇచ్చిన‌ట్లు వినికిడి. కానీ తాజా స‌మాచారం ప్ర‌కారం అయ్య‌ప్ప‌నుమ్ కోషియుమ్ రీమేక్‌లో నటించేందుకు సాయి ప‌ల్ల‌వి ఒప్పుకోలేదనే వార్తలు వస్తున్నాయి.

వేరే ప్రాజెక్ట్‌ల‌ను ఒప్పుకోవ‌డం వ‌ల‌న ఈ ప్రాజెక్ట్ నుంచి సాయి ప‌ల్ల‌వి నో చెప్పినట్లు వినికిడి. అయితే ఆమె ఈ ప్రాజెక్ట్‌కి నో చెప్ప‌డానికి మ‌రో కార‌ణం ఉంద‌ని.. ఇందులో త‌న పాత్ర నిడివి త‌క్కువ‌గా ఉండ‌టంతో పాటు పెద్ద‌గా ప్రాధాన్యం ఉండ‌దనే ఈ రీమేక్ నుంచి త‌ప్పుకున్న‌ట్లు తెలుస్తోంది. ఇందులో నిజ‌మెంతో తెలీదు గానీ.. ప్ర‌స్తుతం ప‌వ‌న్ కోసం మూవీ యూనిట్ మ‌రో హీరోయిన్‌ని సంప్ర‌దిస్తున్న‌ట్లు స‌మాచారం.

Recent Articles English

Gallery

Recent Articles Telugu