పవన్‌ కళ్యాణ్‌కు భార్యగా నిత్యమీనన్‌!

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ ‘వకీల్ సాబ్’ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో మరోసారి తన సత్తా చాటుకున్నాడు. ఆ తరువాత కరోనా బారిన పడిన ఆయన, త్వరలో మళ్లీ షూటింగులో పాల్గొననున్నారు. క్రిష్ డైరెక్షన్‌లో ‘హరిహర వీరమల్లు’ చేస్తున్న ఆయన, మరో వైపున మలయాళ మూవీ ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ రీమేక్ లో నటిస్తున్నారు. సాగర్ కె. చంద్ర ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో మరో కీలకమైన పాత్రలో రానా చేస్తున్న విషయం తెలిసిందే.

ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ భార్య పాత్ర్రలో సాయిపల్లవి కనిపించనున్నట్టుగా వార్తాలు వచ్చాయి. ఆ తరువాత ఐశ్వర్య రాజేశ్ పేరు వినిపించింది. పవన్ భార్య పాత్రకి వీరు సెట్ అవుతారా? అనే సందేహం అభిమానులను వెంటాడింది. అయితే సాయిపల్లవి డేట్స్ కుదలేదట. ఈ నేపథ్యంలో మరో పేరు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుంది. నిత్యామీనన్ ను ఎంపిక చేసుకున్నారనే టాక్‌ వినిపిస్తుంది. నిత్యామీనన్ ఎంత నేచురల్ గా చేస్తుందనే విషయాన్ని గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన అవసరం లేదు. నెక్స్ట్ షెడ్యూల్లో ఆమె షూటింగులో పాల్గొంటుందని అంటున్నారు. ఈ మధ్య కాలంలో నిత్యామీనన్ కి పడిన మంచి పాత్ర ఇది అని చెప్పుకోవచ్చు.

CLICK HERE!! For the aha Latest Updates