తన పెళ్లిపై రూమ‌ర్స్.. ఫైర్‌ అయిన సాయి పల్లవి

ఈ మ‌ధ్య ఇండ‌స్ట్రీలో స్టార్ హీరోయిన్ల పెళ్లిల్ల‌పై వ‌ర‌సగా రూమ‌ర్స్ వ‌స్తూనే ఉన్నాయి. న‌య‌న‌తార‌, అనుష్క లాంటి వాళ్ల త‌ర్వాత ఇప్పుడు సాయి ప‌ల్ల‌వి గురించి కూడా ఇలాంటి వార్త‌లే వ‌చ్చాయి. అస‌లు సంబంధ‌మే లేకుండా సాయి ప‌ల్ల‌వి, ద‌ర్శ‌కుడు ఏఎల్ విజ‌య్ పెళ్లి అంటూ సోష‌ల్ మీడియాలో వార్త‌లు వ‌చ్చాయి. త‌మిళ మీడియాలో దీనిపై వ్యాసాలు కూడా రాసేసారు. దాంతో ఈ న్యూస్ బాగా వైర‌ల్ అయిపోయింది కూడా. అన్నింటికి మించి సాయి ప‌ల్ల‌వి కూడా ఇప్పుడు ఈ వార్త‌ల‌పై ఫైర్ అయింది.

అస‌లు నిజాలు తెలుసుకోకుండా ఇలాంటి వార్త‌లు ఎలా రాస్తారు అంటూ మండిప‌డింది ఈ ముద్దుగుమ్మ‌. దేనికైనా ఓ హ‌ద్దు ఉంటుంది. ఉన్న‌వి లేనివి ఇలా ఎలా రాస్తారంటూ మీడియాకు క్లాస్ పీకింది సాయి ప‌ల్ల‌వి. త‌న పెళ్లి విష‌యంలో అంత తొంద‌రేం లేద‌ని.. ఒక‌వేళ చేసుకోవాల్సి వ‌చ్చినా క‌చ్చితంగా చెప్పే చేసుకుంటాన‌ని చెబుతుంది ఈ బ్యూటీ. ఉన్న‌ట్లుండి త‌న‌పై ఇలాంటి వార్త‌లు రావ‌డంతో నిజంగానే సాయి ప‌ల్ల‌వి కూడా షాక్ అయింది. అస‌లు బేస్ లెస్ రూమ‌ర్స్ రాయ‌డం మందిచి కాద‌ని చెబుతుంది సాయి పల్లవి.

ఇదిలా ఉంటే ఏఎల్ విజ‌య్ గ‌తంలోనే హీరోయిన్ అమ‌లా పాల్‌ను పెళ్ళి చేసుకున్నాడు. రెండేళ్ల కాపురం త‌ర్వాత ఇద్ద‌రూ విడిపోయారు. చాలా రోజులుగా ఏఎల్ విజ‌య్ రెండో పెళ్లి చేసుకుంటున్నాడు అనే వార్త‌లు వ‌స్తూనే ఉన్నాయి. ఇప్పుడు సాయి ప‌ల్ల‌వితో పెళ్లి అన‌గానే అంతా షాక్ అయిపోయారు. ఏఎల్ విజ‌య్ ద‌ర్శ‌క‌త్వంలో క‌ణం సినిమా చేసింది సాయి ప‌ల్ల‌వి. మొత్తానికి త‌న పెళ్లిపై వచ్చిన వార్త‌ల‌ను ఓ రేంజ్‌లో తిప్పి కొట్టిందా సాయి ప‌ల్ల‌వి.