సంక్రాంతి సినిమాలకు టెన్షన్ గా మారింది!

సంక్రాంతి కానుకగా ప్రతి ఏడాది పెద్ద సినిమాలు విడుదలవుతుంటాయి. పండగ సెలవులను టార్గెట్ చేయాలని ఏ హీరో కూడా ఈ సీజన్ ను మిస్ చేయాలనుకోరు. వచ్చే ఏడాది సంక్రాంతికి రాబోయే సినిమాలు ఇప్పటినుండే తన రిలీజ్ డేట్స్ ను ప్రకటించడం మొదలుపెట్టేశాయి. ఇప్పటికే బాలకృష్ణ, కె.ఎస్.రవికుమార్ ల సినిమా సంక్రాంతికి రానున్నట్లు ప్రకటించారు. ఇక మహేష్ బాబు, కొరటాల శివ సినిమా కూడా అప్పుడే రానుంది. ఈ క్రమంలో వీరికి ఓ టెన్షన్ పట్టుకున్నట్లు తెలుస్తోంది. అదే
‘రోబో 2.0’. ఈ సినిమాను కూడా మేకర్స్ సంక్రాంతి కానుకగా విడుదల చేయాలనుకుంటున్నారు.
రజినీకాంత్, శంకర్ కాంబినేషన్ లో గల క్రేజ్ ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందులోనూ రోబో సూపర్ హిట్ కావడంతో దానికి కొనసాగింపుగా వస్తోన్న ఈ సినిమాపై అంచనాలు బాగా పెరిగాయి. ఈసారి అక్షయ్ కుమార్ కూడా యాడ్ అవ్వడంతో క్రేజ్ మరింత పెరిగింది. కాబట్టి సంక్రాంతికి రాబోయే సినిమాలకు ఈ సినిమా పెద్ద టెన్షన్ గా మారడం ఖాయం.