కవలలకు జన్మ నివ్వబోతున్న నటి అనిత.. ఫోటోలు వైరల్‌

డైరెక్టర్‌ తేజ దర్శకత్వంలో వచ్చిన ‘నువ్వు నేను’ చిత్రంతో హీరోయిన్‌గా పరిచయం అయ్యింది అనిత. ఆ తర్వాత తెలుగులో కొన్ని సినిమాలు చేసినా పెద్దగా సక్సెస్ కాకపోవడంతో తిరిగి ఉత్తరాదికి మకాం మార్చేసింది. ఇక సినిమాలు సెట్ కాకపోవడంతో పలు హిందీ సీరియళ్లలో నటించి మెప్పించారు. అనంతరం వ్యాపారవేత్త రోహిత్ రెడ్డిని పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యింది.

తాజాగా ఆమె ప్రెగ్నెంట్ అంటూ వార్తలు హల్ చల్ చేయగా.. ఆమె ప్రెగ్నెన్సీని కన్ఫామ్ చేస్తూ ఓ వీడియోను రూపొందించారు. తాజాగా నిండు గర్భిణిగా ఉన్న అనిత బేబీ బంప్‌లో ఫొటోలకు ఫోజులు ఇచ్చి సోషల్ మీడియాలో షేర్ చేసింది. తాను కవలలకు జన్మ నివ్వబోతున్నట్టు తెలిపింది అనిత. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

CLICK HERE!! For the aha Latest Updates