HomeTelugu Newsసాయిధరమ్‌ తేజ్ "చిత్రలహరి"

సాయిధరమ్‌ తేజ్ “చిత్రలహరి”

12 7

“పిల్లా నువ్వు లేని జీవితం” సినిమాతో కెరీర్‌ను ఆరంభించిన తేజ్.. “సుబ్రమణ్యం ఫర్ సేల్”, “సుప్రీమ్” సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్నారు మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో సాయి ధరమ్‌తేజ్. ఆ తర్వాత వరుసగా ఆరు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. దీంతో ఈ సారైన హిట్ కొట్టి టాలీవుడ్‌లో స్థిరపడాలనే నిశ్చయంతో తేజ్ ఉన్నాడు. మరోవైపు బరువు తగ్గేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నాడు. సాయి ధరమ్‌తేజ్ “చిత్రలహరి” సినిమాతో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వస్తున్నాడు. “సుప్రీమ్” సినిమా తర్వాత మళ్లీ సరైన హిట్ దక్కకపోవడంతో ఈ సినిమాపై సాయి ధరమ్‌తేజ్ చాలా ఆశలు పెట్టుకున్నాడు. “నేను శైలజ” దర్శకుడు కిశోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో తేజ్ సరసన కల్యాణీ ప్రియదర్శన్, నివేదా పేతురాజ్‌ నటిస్తున్నారు.

ఈ చిత్రాన్ని ఏప్రిల్ 12న విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. ఈ సందర్భంగా దర్శకుడు కిశోర్ తిరుమల మాట్లాడుతూ.. ఈ చిత్రంలోని టైటిల్‌లో ఉన్న ఐదు అక్షరాలకు.. ఈ సినిమాలో ఐదు క్యారెక్టర్స్‌కు సంబంధం ఉంటుందని తెలిపారు. సినిమా అంతా ఈ ఐదు పాత్రల చుట్టే తిరుగుతుందన్నారు. మంచి ఎమోష‌న‌ల్ ఫీల్ గుడ్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు తెలిపారు. సాయిధరమ్‌ తేజ్ కెరీర్‌లోనే ఇది బెస్ట్ మూవీగా నిలిచిపోతుందని అన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu