వరుస సినిమాలతో బిజీ అయిన సాక్షి అగర్వాల్


కాలా చిత్రంలో చిన్న పాత్రలో కనిపించి మురిపించిన సాక్షి అగర్వాల్‌.. ఇప్పుడు రాయ్‌లక్ష్మి నటిస్తున్న సిండ్రల్లా చిత్రంలో నటిస్తోంది. ఇందులో ఆమె కీలకపాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. జీవీ ప్రకాశ్‌ నటిస్తున్న హర్రర్‌ చిత్రంలోనూ ఓ కథానాయికగా చేస్తోంది సాక్షి అగర్వాల్. ఈ సందర్భంగా తన సినిమాల గురించి సాక్షి మాట్లాడుతూ రజనీ సార్‌ నటించిన కాలా చిత్రంతో నాకు మంచి గుర్తింపు వచ్చింది. ఇప్పుడు 3 సినిమాల్లో ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నా. జీవీ ప్రకాశ్‌ హీరోగా ఎళిల్‌ దర్శకత్వం వహిస్తున్న చిత్రం నాకు మరింత గుర్తింపు తెచ్చి పెడుతుందని నమ్ముతున్నా. ఇందులో తిరునల్వేలి అమ్మాయిలా లంగా, ఓణీతో నటించా. అలాగే దర్శకుడు అనీస్‌ తెరకెక్కిస్తున్న కొత్త చిత్రంలో కూడా నటిస్తున్నా. ఈ మూడు సినిమాల చిత్రీకరణ జరుగుతోందని పేర్కొంది.

CLICK HERE!! For the aha Latest Updates