HomeTelugu Trendingబంగార్రాజులో రియల్‌ జోడి!

బంగార్రాజులో రియల్‌ జోడి!

Samantha and Naga Chaitanya

అక్కినేని నాగార్జున నటించనున్న తాజా చిత్రం ‘బంగార్రాజు’. ఆయన సొంత బ్యానర్లో కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ‘బంగార్రాజు’ సినిమా రూపొందనుంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమాలో నాగార్జున సరసన నాయికగా రమ్యకృష్ణ కనిపించనుంది. ఇక వీరి కొడుకు పాత్రలో నాగచైతన్య నటించనున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే ఈ సినిమాకి సంబంధించి మరో ఆసక్తికర వార్త సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

నాగచైతన్య భార్య పాత్రలో ఆయన భార్య, స్టార్‌ హీరోయిన్‌ సమంత కనిపించనుందనే టాక్ ఇప్పుడు బలంగా వినిపిస్తోంది. వీరి తనయుడిగా అఖిల్ నటించనున్నాడు. అంటే ఒక రకంగా నాగ్ ఫ్యామిలీ దాదాపు కవర్ అవుతుందన్న మాట. ఫ్యామిలీ సినిమా కావడం .. చైతూ భార్య పాత్ర కావడం వలన సమంత ఓకే చెప్పిందని అంటున్నారు. అయితే ఇందులో నిజం ఎంత ఉందో తెలియాల్సి ఉంది. త్వరలోనే ఈ సినిమాను పట్టాలెక్కించే దిశగా సన్నాహాలు జరుగుతున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu