చిరు 151వ చిత్రం ఉపాసన చేతుల్లో..?

మెగాస్టార్ చిరంజీవి కోడులు, రామ్ చరణ్ భార్య అయిన ఉపాసన తన భర్త సినిమాల విషయంలో జాగ్రత్తలు తీసుకున్నట్లే కనిపిస్తుంది. చరణ్ నటిస్తోన్న ‘రంగస్థలం’ సినిమా సెట్స్ లో ఉపాసన తరచూ కనిపిస్తూనే ఉంది. ఇప్పుడు చిరంజీవి 151వ సినిమా ‘సైరా’లో ఆమె హస్తం ఉందని అంటున్నారు. ఈ సినిమాకు నిర్మాతగా రామ్ చరణ్ వ్యవహరిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం చరణ్ ‘రంగస్థలం’ హడావిడిలో ఉన్న కారణంగా ఉపాసన వర్కింగ్ ప్రొడ్యూసర్ గా పని చేస్తోందని టాక్. చరణ్ నటించిన ‘దృవ’, చిరు ‘ఖైదీ నెంబర్ 150’ సినిమాల ప్రమోషన్ యాక్టివిటీస్ విషయాల్లో ఉపాసన దగ్గరుండి మరీ అన్నీ చూసుకుంది.

ఇప్పుడు చరణ్ ‘సైరా’ సినిమాను కూడా ఉపాసన చేతుల్లో పెట్టాడని టాక్. ప్రస్తుతం ఈ సినిమా ప్రీప్రొడక్షన్ దశలో ఉంది.
దీపావళి తరువాత షూటింగ్ మొదలుపెడతారు. నయనతార, అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి వంటి తారలు సినిమాలో ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు.