
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గత కొంతకాలంగా మయోసైటిస్ కారణంగా సినిమాలకు తాత్కాలిక బ్రేక్ ఇచ్చింది. అనారోగ్యంతో పోరాడుతున్న ఈ అమ్మడు ఎంతో బలంగా తిరిగి నిలదొక్కుకుంటుంది. తన ట్రీట్‌మెంట్‌లో భాగంగా కొద్దిరోజుల క్రితం భూటాన్‌లో ఆయుర్వేద చికిత్సను కూడా తీసుకుంది. సమంత పూర్తి ఆరోగ్యంతో తిరిగి రావాలని తన అభిమానులు ఆశిస్తున్నారు. సమంత ఓ నటిగానే కాకుండా తనలో మంచి సేవాగుణం ఉంది.
దక్షిణాది అగ్రహీరోలందరితోనూ వరుస సినిమాలు చేసిన ఈ అగ్రతార కొన్నేళ్ల క్రితం ప్రత్యూష సపోర్ట్ అనే స్వచ్చంద సేవా సంస్థ ఏర్పాటు చేసి చిన్నారులకు వైద్యం అందజేస్తోందన్న సంగతి తెలిసిందే. ధీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే చిన్నారులకు చికిత్స అందేలా చూసుకుంటున్నారు. కొన్ని రకాల ప్రాణాపాయ వ్యాధులకు కూడా చికిత్స అందేలా సహాయం చేస్తున్నారు.
అంతేకాదు ప్రాణాపాయ వ్యాధులకు కూడా వైద్యం అందిస్తున్నారు సమంత. ఇదంతా తను ఏర్పాటు చేసిన ప్రత్యూష సపోర్టు అనే స్వచ్చంద సహకారంతో ఆమె చేశారు. సమంత సుమారుగా 11 ఏళ్లుగా ఈ సంస్థను నడుపుతోంది. ఈ సంస్థ మహిళలు, బాలబాలికల సంక్షేమం కోసం పనిచేస్తుంది. ఇప్పటికే ఎందరో చిన్నారులకు అండగా నిలబడిన సమంత ఇద్దరు చిన్నారులను దత్తత తీసుకోవాలని అనుకుంటున్నట్లు ప్రచారం జరుగుతుంది.
త్వరలో ఇద్దరు చిన్నారలను దత్తత తీసుకుని వారి ఆలనాపాలన చూసుకునే బాధ్యతను తీసుకోవాలని అనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే, ఈ వార్తల్లో ఎంత నిజం ఉందో తెలీదు కానీ, దీనిపై క్లారిటీ రావాలంటే.. సమంత కానీ, ఆమె టీం కానీ స్పందించాలి.













