రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన భారీ మల్టీస్టారర్ చిత్రం ఆర్‌ఆర్‌ఆర్ పాన్ ఇండియా మార్కెట్‌లో వసూళ్ల వర్షం కురిపించింది. కమల్ హాసన్ విక్రమ్ కూడా మల్టీస్టారర్‌గా వచ్చి.. కోలీవుడ్ ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది.
ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తోంది. రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమా పాన్ ఇండియా మార్కెట్లో భారీ వసూళ్లు రాబట్టింది. కమల్‌హాసన్ విక్రమ్ మూవీ కూడా కోలీవుడ్ ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. పాన్ ఇండియా మూవీస్ ట్రెండ్‌పై హీరోయిన్స్ కూడా మనసుపడుతున్నారు. ముఖ్యంగా సమంత పాన్ ఇండియా మల్టీస్టారర్‌గా ముందుకెళ్తోంది.
కోలీవుడ్‌లో నయనతారతో కలిసి సమంత కణ్మణి రాంబో కతిజా(కేఆర్‌కే) చేసింది. ఒకే ఫ్రేమ్‌లో ఇద్దరు లేడీ సూపర్ స్టార్స్ కనిపించడంతో ఈ ఏడాది కోలీవుడ్ బిగ్గెస్ట్ హిట్స్‌లో ఒకటిగా నిలిచింది. బాలీవుడ్‌లోనూ మరో హీరోయిన్‌తో కలిసి మల్టీస్టారర్ హిట్ కొట్టాలనుకుంటోంది సమంత.
బాలీవుడ్‌లో లీడింగ్‌లో ఉన్న తాప్సీతో కలిసి సమంత పాన్ ఇండియా మూవీ చేయబోతుంది. కొద్ది రోజుల క్రితమే వీరిద్దరికాంబినేషన్‌లో సినిమా అంటూ రూమర్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే నిజమైంది. ప్రస్తుతానికి తాప్సీ బ్యానర్ లో సమంత నటించే చిత్రానికి సంబంధించి కథ సిద్ధమవుతోంది. ఈ సినిమాలో తాప్సీ కూడా ఓ కీలకమైన పాత్రలో నటిస్తోంది. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడించనున్నారు.